వైరల్: భర్త, అత్తమామల దిష్టి బొమ్మలను తగలబెట్టిన కోడలు
TeluguStop.com
మన భారతదేశ వ్యాప్తంగా విజయదశమి పండుగను( Vijayadasami ) ఘనంగా నిర్వహించుకున్నారు.అయితే.
, ఉత్తరప్రదేశ్ లోని( Uttar Pradesh ) హమీర్‌పూర్ జిల్లా ముస్కారా పట్టణంలో ఓ మహిళ తన భర్త, అత్తమామలు ఫోటోలు అతికించి వారి దిష్టిబొమ్మలను దహనం చేసి అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది.
ఇందుకు సంబందించిన ఓ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో దసరా పండగ రోజు సాయంత్రం ఓ మహిళ తన భర్త, అత్త, మామల రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేసిందని ప్రచారం జరుగుతోంది.
ఈ అపూర్వ దహనం ముస్కారాతో పాటు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. """/" /
ముస్కరా నగర్‌లో ఉంటున్న ప్రియాంకకు( Priyanka ) 10 సంవత్సరాల క్రితం సంజీవ్ దీక్షిత్‌తో( Sanjay Deekshit ) వివాహమైంది.
అప్పటికే ఆమె భర్త తన సోదరి స్నేహితురాలు పుష్పాంజలితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో సంజీవ్ కొన్ని రోజుల తర్వాత ప్రియాంకను విడిచిపెట్టి పుష్పాంజలి( Pushpanjali ) అనే అమ్మాయితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నటు సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక నిరసనకు దిగింది.అయితే అత్త, మామ, కోడలు ఒప్పుకోకపోవడంతో గత 14 ఏళ్లుగా అటూ ఇటూ తిరిగాల్సి వచ్చింది.
అందుకే విజయదశమి రోజున తన భర్త దిష్టిబొమ్మను తయారు చేసి ఇంటి ముందు దహనం చేసి రావణుడి లాంటి వారిని సమాజంలో బహిష్కరించాలని సందేశం ఇచ్చే ప్రయత్నం చేశానని తెలిపింది.
"""/" /
బాధితురాలు ప్రియాంక దీక్షిత్ మాట్లాడుతూ.తనకు పెళ్లయి 14 ఏళ్లు గడిచినా ఇప్పటికీ తనకి నాయం జరగలేదు అని తెలిపింది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, యోగి ప్రభుత్వం 'బేటీ పఢావో, బేటీ బచావో' ప్రచారం నిర్వహిస్తోందని, ఈ రోజు చదువుకున్న కుమార్తెను రక్షించలేదా అని ప్రియాంక తెలిపింది.
ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరినట్టు సమాచారం.
ఈ ఫేస్ ఆయిల్ తో సూపర్ గ్లోయింగ్ అండ్ హెల్తీ స్కిన్ మీ సొంతం!