అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. షాకింగ్ వీడియో వైరల్..

ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) మెయిన్‌పురి జిల్లాలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది.కోట్వాలీ పట్టణంలోని కాకాన్ గ్రామానికి చెందిన దీప( Deepa ) అనే మహిళ 80 వేల రూపాయల బకాయి వసూలు చేసుకోవడానికి ఒక మొబైల్ షాపుకు వెళ్లింది.

ఆమె డబ్బు తిరిగి ఇవ్వమని అభ్యర్థించగా, దుకాణదారుడు( Shopkeeper ) ఆమెతో వాగ్వాదానికి దిగాడు.

ఈ ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకుంది.దీప అరుపులు వినడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు.

"""/" / మీడియా రిపోర్ట్స్ ప్రకారం, దీపకు డబ్బు చెల్లించాల్సిన యువకుడు ఆమెపై పెట్రోల్ పోసి( Petrol ) మధ్యరోడ్డుపైనే నిప్పంటించాడు.

చుట్టుపక్కల వారు వెంటనే మంటలను ఆర్పి, దీపను ఆసుపత్రికి తరలించారు.దీపకు తీవ్ర గాయాలు అయ్యాయి.

ఆమెను మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రి నుండి మరొక ఆసుపత్రికి తరలించారు.

ఈ దారుణ ఘటనలో గాయపడ్డ ఆమె 70-80% శరీరం కాలిపోయి మృత్యువుతో పోరాడుతోంది.

వైరల్ అయిన ఓ వీడియోలో బాధితురాలు మాట్లాడటం మనం వినవచ్చు. """/" / ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దీప, దుకాణదారుడు తనను చంపాలనే ఉద్దేశంతో నిప్పంటించాడని ఆరోపించింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలపై జరుగుతున్న దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దీప ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.ఆమె కోలుకుంటుందా లేదా అనేది వైద్యులు చెప్పలేకపోతున్నారు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి నేరాలు చాలా ఎక్కువ అవుతున్నాయి.రోజు ఈ రాష్ట్రం నుంచి ఎన్నో క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయి.

మరి దీనిపై సీఎం దృష్టి సారిస్తారో లేదో చూడాలి.

జుట్టుకు కలర్ వేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!