ప్రేమను గెల్పించుకునేందుకు ఆ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!
TeluguStop.com
ప్రేమను దక్కించుకునేందుకు ఎన్నెన్నో యుద్దాలు చేసిన వారున్నారు.అలాగే త్యాగాలూ చేసిన వాళ్లు ఉన్నారు.
కలిసి బతకలేమని తెలిసి చావులో ఒక్కటైన వారూ కోకొల్లలు.అయితే తాజాగా ఓ అమ్మాయి తన ప్రేమను దక్కించుకునేందుకు ఏం చేసిందో తెలుసా.
ఏకంగా తన లింగాన్నే మార్పించుకుంది.ఎందుకంటే ఆమె ప్రేమించింది మరో అమ్మాయిని.
అందుకే ఆమె అతడిలా మారి తన ప్రేయసిని పెళ్లాడలనుకుంది.అయితే తాను అబ్బాయిలా మారాలనుకునే కంటే ముందే వారిి ప్రేమను ఇరు కుటుంబాలకు చెప్పారు.
కానీ వారు ఒప్పుకోకపోవడంతో.ఓ అమ్మాయి లింగ మార్పిడి చేయించుకుంది.
ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ నగరానికి చెందిన ఈ ఇద్దరు యువతులు.ఒకరినొకరు ప్రేమించుకున్నారు.
ఎలాగైనా కలిసి జీవించాలని కంకణం కట్టుకున్నారు.అయితే భవిష్యత్తులో తమ ప్రేమకు ఎలాంటి అడ్డంకులు రాకూడదనే ఉద్దేశంతో ఆ అమ్మాయి లింగ మార్పిడి చికిత్సకు సిద్ధం అయింది.
వెంటనే స్వరూప్ రాణి ఆస్పత్రిలోని ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యుడు మోహిత్ జైన్ కలిసి సంప్రదించింది.
ముందుగా ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చిన వారు.ఆమె మానసికంగా ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు.
అలాగే ఆమె లింగ పరమైన సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించి సర్జరీ చేసేందుకు ఒప్పుకున్నారు.
మొత్తం 18 నెలల పాటు పలు శస్త్ర చికిత్సలు చేసి ఆమెను.అతడిగా మారుస్తామని వైద్యులు తెలిపారు.
ముందుగా ఆ అమ్మాయి జననాంగాలను తొలగించి, ఛాతిని తొలగించి.అబ్బాయిలా మారేందుకు కావాల్సిన చికిత్సలు చేస్తామన్నారు.
అందుకోసం ఈమె ఏడాదిన్నర పాటు వేచి చూడాల్సిందే.అప్పుడే ఈమె తన ప్రేమను దక్కించుకోగలదు.
వావ్, మెక్‌డొనాల్డ్స్ లాంటి అమ్యూజ్‌మెంట్ పార్క్.. అంతా ఏఐ మహిమ..!