కూతురిపై కన్నతండ్రి అఘాయిత్యం..!
TeluguStop.com
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కామంతో రగిలిపోయాడు.మద్యం మత్తులో వరుసలు మరిచిపోయాడు.
క్రూర మృగంలా మారి మైనర్ కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు.యూపీలోని నోయిడాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
బీహార్ కు చెందిన ఓ వ్యక్తి(45) బతుకుదెరువు కోసం నోయిడాకు వలస వచ్చాడు.
కూలీ పనులు చేస్తు ఫేజ్-2లో నివాసముంటున్నాడు.ఇతడికి భార్య, పిల్లలు ఉన్నారు.
మద్యానికి బానిసైన ఈ మానవ మృగం తన పదమూడేళ్ల మైనర్ బాలికపై కన్నేశాడు.
మద్యం మత్తులో బాలికను బలవంతంగా రూంలోకి లాక్కెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడే వాడు.
భర్త ప్రవర్తనలో మార్పును గమనించి బాధితురాలు తల్లి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది.
పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.ఉమెన్ సేఫ్టీ డిప్యూటీ కమిషనర్ వృందా శుక్లా మాట్లాడుతూ.
కూతురిపై అత్యాచారం జరిగిందని బయట తెలిస్తే ఎక్కడ పరువు పోతుందో అని కుటుంబ సభ్యులు కేసు నమోదు చేయడానికి ముందుకు రాలేదని, భర్త ఆగడాలు రోజురోజుకి ఎక్కువవడంతో బాధితురాలి తల్లి పోలీసులు ఫిర్యాదు చేసిందన్నారు.
ఈ మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు.కేసు విచారణలో ఉందని, నిందితుడికి కఠినంగా శిక్షిస్తామన్నారు.
బాలయ్య ఎన్టీయార్ కాంబోలో మిస్ అయిన మల్టీ స్టారర్ సినిమా ఏంటో తెలుసా..?