ఒక్క లీటర్ కెమికల్స్‌తో 500 లీటర్ల నకిలీ పాలు తయారీ.. వీడియో చూస్తే షాకే..
TeluguStop.com
ఉత్తర్ ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో( Bulandshahr ) ఒక వ్యాపారి నకిలీ పాలు తయారు చేస్తూ అడ్డంగా పట్టుబడ్డాడు.
ఆయన పేరు అజయ్ అగర్వాల్.( Ajay Agarwal ) ఆయన తన దుకాణంలో ఒక లీటర్ కెమికల్‌ను వాడి ఏకంగా 500 లీటర్ల నకిలీ పాలు తయారు చేస్తున్నాడు! ఈ కేటుగాడు కెమికల్స్‌ను ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, రుచులతో కలిపి నిజమైన పాలలా కనిపించేలా నకిలీ పాలు( Fake Milk ) తయారు చేస్తున్నాడు.
ఇలా 20 ఏళ్ల నుంచి నకిలీ పాలు, పనీర్‌ను అమ్ముతున్నాడు.ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా( FSSAI ) అధికారులు తాజాగా అగర్వాల్ షాప్, నాలుగు స్టోరేజీ ఫెసిలిటీలపై రైడ్స్ చేశారు.
ఈ దాడిలో నకిలీ పాల తయారీకి ఉపయోగించే ప్రీ-మిక్స్డ్ కెమికల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కేవలం 5 మిల్లీ లీటర్ల కెమికల్‌తో రెండు లీటర్ల నకిలీ పాలు ఎలా తయారు చేయవచ్చో అతను అధికారుల ముందు చూపించాడు.
దానికి సంబంధించిన వీడియో వైరల్( Viral Video ) అయింది అది చూసి చాలా మంది కంగు తింటున్నారు.
"""/" /
అజయ్ అగర్వాల్ తన గ్రామంలోని ఇతర పాల వ్యాపారులకు కూడా తన నకిలీ పాల తయారీ ఫార్ములాను నేర్పించాడని తెలిసింది.
ఆయన ఉపయోగించిన ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్‌లో రెండేళ్ల కిందట గడువు ముగిసినవి కూడా ఉన్నాయి.
పోలీసులు కాస్టిక్ పొటాష్, వే పౌడర్, సార్బిటాల్, మిల్క్ పెర్మియేట్ పౌడర్, రిఫైన్డ్ సోయా ఫ్యాట్స్ వంటి హానికరమైన పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
"""/" /
అజయ్ అగర్వాల్ ఈ ఫార్ములాను ఎక్కడ నుంచి తెలుసుకున్నాడో తెలుసుకోవడానికి పోలీసులు ఆయనను ప్రశ్నిస్తున్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారి వినిత్ సక్సేనా మాట్లాడుతూ, నకిలీ పాలు కొన్న వారిని గుర్తించడానికి, గత ఆరు నెలల్లో ఈ నకిలీ పాలు ఎలా విక్రయించబడ్డాయో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.
పోలీసులు ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇలాంటి నకిలీ ఆహార పదార్థాలు మన ఆరోగ్యానికి చాలా హానికరం.
అందుకే మనం ఏదైనా ఆహార పదార్థం కొనే ముందు అది నాణ్యమైనదో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి.
ఎక్కువగా మంచి పేరున్న బ్రాండ్స్ ఫుడ్ ప్రొడక్ట్స్ వాడటమే మంచిది.
యాక్టింగ్ వదిలేయాలనుకుంటే భార్య మాటలే నిలబెట్టాయి.. శివ కార్తికేయన్ కామెంట్స్ వైరల్!