మొదటి చిత్రం లో నటించినప్పుడు ఓ బిడ్డ తల్లి.. తదుపరి చిత్రానికి రెండో బిడ్డతో బాలింత!
TeluguStop.com
మహానటి సావిత్రి తర్వాత అంతటి గుర్తింపు పొందిన మరో నటి షావుకారు జానకి.
తన తొలి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న అద్భుత నటీమణి.తెలుగు సినిమా పరిశ్రమలోని గొప్ప హీరోయిన్లలో తనూ ఒకరు.
ఆమె నిజ జీవితం, సినిమా జీవితం చాలా దగ్గరి పోలికలను కలిగి ఉంటుంది.
తను మొదటి సినిమాలో నటించే సమయానికి ఆమె ఓ బిడ్డకు తల్లిగా మారింది.
ఆరోజుల్లో బాల్య వివాహాలు కామన్ గా ఉండేవి.తనకు పెళ్లి అంటే ఏంటో తెలియని నాడే జానకికి వివాహం అయ్యింది.
18 ఏండ్లు నిండక ముందే తల్లి అయ్యింది.పాపను పోషిస్తూ.
కుటుంబ బరువును తనే మోసేది జానకి.తప్పని సరి పరిస్థితుల్లో డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏర్పడింది.
తొలి సినిమా సమయంలో జానకికి గ్లామర్ అస్సలే లేదు.పొట్టిగా, బలహీనంగా ఉండేది.
అలాంటి రోజుల్లో తను షావుకారు సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.ఎన్టీఆర్ హీరోగా చేసిన ఈ సినిమా విజయం సాధించడంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.
ఆ తర్వాత జెమినీ నిర్మాణ సంస్థ నిర్మించిన ముగ్గురు కొడుకులు సినిమాలో జానకి నటించింది.
ఆమెకు అది రెండో సినిమా.అప్పటికి ఒకే సినిమా చేయడం మూలంగా తన ఆర్థిక పరిస్థితి అంతగా బాగా లేదు.
అదే సమయంలో తనకు రెండో సంతానంగా బాబు జన్మించాడు.బాలింతరాలు.
సరైన ఆహారం లేక నీరసంగా ఉండేది ఆమె. """/"/ అయినా జీవిత పోరాటం కోసం సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది.
అదే సమయంలో జెమినీ గణేషన్.జెమినీ సంస్థలో యాక్టర్లను ఎంపిక చేసే మేనేజర్ గా ఉండేవాడు.
అతడిని జానకి అన్నా అని పిలిచేది.జెమినీలో నటించడానికి జానకి ప్రయత్నించినప్పడు తన ఫోటోలను తీసుకున్నాడు.
సమయం వచ్చినప్పుడు కబురు పంపుతానని చెప్పాడు.కొద్ది రోజుల తర్వాత దర్శకుడు నాగేంద్రరావు దర్శకత్వంలో జెమినీ సంస్థ ముగ్గురు కొడుకులు సినిమా తీయాలనే ప్రయత్నాలు మొదలు పెట్టింది.
అందులో కోడలి పాత్రకు జానకి సరిపోతారని భావించి రమ్మని చెప్పాడు.జెమినీ సంస్థ అధినేత వాసన్ ఆమెను చూడగానే ఆ పాత్రకు ఎంపిక చేశాడు.
ముగ్గురు కొడుకులు షూటింగ్ మొదలయ్యింది.సరైన తిండిలేదు.
పిల్లల బాధ్యతలు చూడాలి. """/"/ అలా చేస్తూనే రోజూ షూటింగ్ కు వచ్చేది జానకి.
ఓరోజు నీరసాన్ని తట్టుకోలేక షూటింగ్ సమయంలోనే పడిపోయింది.వెంటనే డాక్టర్ ను పిలిపించి చికిత్స చేయించారు.
ఆ తర్వాత వాసన్ అడినిప్పుడు అసలు విషయం చెప్పింది జానకి.ఆమె పరిస్థితి పట్ల జాలిపడ్డ ఆయన.
ఈ సినిమాకు ఇచ్చే పారితోషికం అంతా ఒకేసారి ఇవ్వాలని చెప్పాడు.ఆ తర్వాత వారంరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడు.
అన్నట్లుగానే తను వారం తర్వాత మంచి ఆరోగ్యంతో షూటింగ్ లో పాల్గొంది.అక్కడి నుంచి జానకి వెనుతిరిగి చూసుకోలేదు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్24, గురువారం 2025