ఒక్క పూట తినడానికి లేని సాయి కుమార్ బాల్యం గురించి తెలిస్తే కన్నీళ్లే !

సినిమా ఇండస్ట్రీ ఎవరికి పూల పాన్పు కాదు.ఇక్కడ అవకాశాలు ఎవరో ఇస్తారని కలలు కనకు.

ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని ఊహ కూడా వద్దు.ఇక్కడ ఉన్న వారి టాలెంట్ కి గుర్తింపు లేదు.

ఆ మాటలు గుర్తచ్చి నిద్రలోంచి ఉలిక్కి పడి లేచాడు పూడిపెద్ద సాయికుమార్.ఆ మాటలు పదేపదే గుర్తు చేసుకొని దీర్ఘాలోచనలో పడి కాసిన్ని మంచినీళ్లు తాగి మళ్లీ వెళ్లి పుస్తకం చదువుకున్నాడు.

ఇక ఆరోజు కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళి తండ్రి చెప్పిన ఆ మాటలను పదేపదే గుర్తు తెచ్చుకొని మరీ బుద్ధిగా చదువుకున్నాడు.

కాసేపటికి ఆకలేసి ఏమైనా తిందామని వంటగదిలోకి వెళితే అక్కడ అన్ని ఖాళీ పాత్రలే కనిపించాయి.

ఒక మనిషికి సరిపడా అన్నం మాత్రం ఒక ప్లేట్లో ఉంది.అది తిని ఇంటి బయట కూర్చున్నాడు.

కానీ అప్పటికే మంచం పైన శర్మ నిద్ర పట్టకుండా అటు ఇటు కదులుతున్నాడు.

దాంతో అతని భార్య కృష్ణ జ్యోతి కాస్త తిని పడుకోమంటే వినలేదు ఇప్పుడు చూడండి నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారు అంది.

ఆ మాటలు విన్న సాయికుమార్ గుండెల్లో రాయి పడ్డంత పనైంది.కానీ ఆ మాటలకు శర్మగారు నేను తిని పడుకుంటే సాయి ఏం తింటాడు వాడు ఆకలితో పడుకుంటే నేనెలా తినగలను అని ఎంతో బాధపడ్డాడు.

ఆ క్షణం సాయికుమార్ ఎంతగా కుమిలిపోయాడో అతనికి మాత్రమే తెలుసు.తనకోసం తినకుండా ప్లేట్లో పెట్టి తల్లిదండ్రులు ఇద్దరు ఏమీ తినకుండా పడుకున్నారు.

అందుకే ఇప్పటికి అన్నాన్ని చూసిన ప్రతిసారి తన తల్లిదండ్రుల అతనికి గుర్తొస్తారు.తండ్రి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నటుడుగా అంతంతమాత్రంగానే సంపాదిస్తున్న రోజులవి.

సాయికుమార్ బాగా చదువుకొని ఉద్యోగం చేయాలని అతడి తండ్రి కలలు కన్నాడు.కానీ ఓ రోజు ఎరువుల కంపెనీ 250 రూపాయలు ఇస్తాము రేడియోలో వాయిస్ చెప్తావా అని అడిగారట.

దాంతో అతడు ఒప్పుకోలేదు.కానీ తల్లి కృష్ణ జ్యోతి నువ్వు తెచ్చి ఆ 250 రూపాయలతో ఈనెల సరుకులు మొత్తం కొనొచ్చు ఈ లోపు మీ నాన్నకి ఏదైనా అవకాశం దొరికి మళ్ళీ డబ్బులు సంపాదిస్తారు.

నువ్వు వచ్చిన ఈ అవకాశాన్ని పోగొట్టుకోకు అని చెప్పారట.అక్కడ నుంచి సాయికుమార్ ప్రస్థానం మొదలైంది.

"""/"/ ఆయనకు రావాల్సినంత స్టార్ డం రాలేదనేది మాత్రం వాస్తవమే అయినా ఉన్నంతలో ఆయన బాగానే నిలబడ్డారు.

నాటి నుంచి నేటి వరకు అదే విధంగా ముందుకు వెళుతున్నారు.తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే డబ్బింగ్ మరియు నటన కు బీజం పడింది.

ఎందుకంటే తండ్రి పీజే శర్మ ఎంతో గొప్ప డబ్బింగ్ ఆర్టిస్టు మాత్రమే కాదు అంతకు మించిన నటుడు.

ఇక తల్లి కృష్ణ జ్యోతి రంగస్థలం నటి.కన్నడ సూపర్ స్టార్ హీరో రాజ్ కుమార్ తో కూడా కలిసి ఆవిడ పని చేశారు.

అలా 13 ఏళ్ల వయసులోనే బాలు నటుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన కంఠంతో ఎన్నో అవకాశాలను దక్కించుకున్నాడు.

ఇక ఆయన ఎంతో బోలా మనిషి.ఎంతగా సంపాదించాడో కానీ ఎప్పుడూ మాత్రం ప్రశాంతంగా నిద్రపోలేదు అంటారు.

ఎందుకంటే అతడికి తన చిన్ననాటి రోజులు ఎప్పటికీ గుర్తొస్తాయి.ఎంతో మంది మోసం చేశారు.

పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి కూడా రావాల్సిన బకాయిలు ఇవ్వలేదు.అతని ఇంట్లో బౌన్స్ అయ్యి వచ్చిన చెక్కులు వందల్లో ఉంటాయి.

అన్ని లెక్కలు వేస్తే రావాల్సిన డబ్బు కోట్లల్లో ఉంటుంది.ఎవరు ఏమి అడిగినా కాదనకుండా సహాయం చేసే సాయికుమార్ ని చాలామంది మోసం చేశారు.

ఏపీ కేబినెట్ భేటీ :  సోషల్ మీడియా కోసం కొత్త చట్టం ?