నీరజ్ చోప్రా బంగారు పతకం వెనక కన్నీటి వ్యధలు ఎన్నో..
TeluguStop.com
విజయం ఎవరికీ అంత ఈజీగా రాదు.అలాగే టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు.
ఇక ఇప్పుడు నీరజ్ చోప్రా 'బాలీవుడ్ హీరో'కు ఏ మాత్రం తీసిపోడు.ఆ లాంగ్ హెయిర్.
కండలు తిరిగిన బాడీతో సూపర్ హీరోలా ఉన్నాడంటూ పొగుడుతూ ఉంటారు.అయితే.
మనం ఈ రోజు చూస్తున్న నీరజ్ చోప్రా.ఒకప్పుడు ఇలా లేడు.
అసలు హీరో మెటీరియల్ కాదు కదా.తోటి స్నేహితులే అతడి రూపాన్ని చూసి ఆట పట్టిస్తూ ఉండేవారంట.
నీరజ్ పదేళ్ల వయసుకే ఊబకాయం సమస్యతో బాధపడ్డారు.ఇక వయసును మించిన బరువుతో స్నేహితులు, బంధువుల వద్ద మాటలు పడుతూ ఉండేవాడు.
"""/"/
అయితే ఏరోజైనా మంచిగా కుర్తా-పైజామా వేసుకొని వెళ్తే.అరెవో సర్పంచ్.
అని ఆట పట్టించే వారంట.అంతేకాక.
సర్పంచ్ అంటే ముసలోడా అని వ్యంగ్యంగా అన్నట్లు మాట్లాడేవారంట.ఇక ఈ అవమానాలు.
ఛీత్కారాలు నీరజ్ మనసులో కసిని పెంచాయి.ఎలాగైనా బరువు తగ్గి అందరికీ సమాధానం చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు.
కాగా.స్నేహితులు, బంధువుల అవమానాలను తట్టుకోలేక నీరజ్ ఏడ్చేవాడంట.
అయితే అతని బాధను చూసి తల్ల దండ్రులు కూడా నీరజ్ బరువును తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.
"""/"/ ఇక పానిపట్‌కు సమీపంలోని ఖాంద్ర అనే గ్రామంలో నీరజ్ కుటుంబం నివాసం ఉండేవారు.
అయితే నీరజ్ బరువు తగ్గించడానికి ప్రతీ రోజు అతడిని పానిపట్ స్టేడియంకు తీసుకొని వెళ్లి అక్కడ పరుగులు పెట్టిస్తూ ఉండేవారు.
కాగా.నీరజ్ అక్కడ ట్రాక్‌పై పరుగులు పెడుతూనే.
జావెలిన్ త్రో చేసే వాళ్లను చేస్తుండేవాడు.అయితే ఈటెను కసిగా దూరంగా విసరడం అతడికి ఎందుకో నచ్చింది.
ఇక అలా తొలి సారి జావెలిన్ పట్టుకున్న నీరజ్.దాన్నే లోకంగా చేసుకున్నారు.
కాగా.బరువు తగ్గించుకుందామని వెళ్లిన వాడు కాస్తా.
అథ్లెట్‌గా మారిపోయారు.అంతేకాదు.
జావెలిన్ త్రోలో శిక్షణ కోసం పంచకులలోని దేవీలాల్ స్టేడియంకు వెళ్లారు.ఆ తరువాత వరుసగా జూనియర్ లెవెల్లో పతకాలను కైవసం చేసుకున్నాడు.
అప్పుడు మావయ్య బలంగా హత్తుకొని ముద్దుపెట్టారు.. సాయితేజ్ కామెంట్స్ వైరల్!