పొద్దున్నే మొదలై, సాయంత్రం ఆగిపోయిన సినిమా..చివరికి ఏమైంది ?
TeluguStop.com
కొత్త వారికి అవకాశం దొరకాలంటే, నిర్మాత దొరకడం ఎంత కష్టమో అందరికి తెలిసిందే.
ఒక సినిమాకు ఎన్ని కష్టాలు పడాలో అన్ని పడ్డ దర్శకుడు బాల.కథను సరిగ్గా ఎంచుకోవాలి, ఆ కథకు తగ్గ హీరోను సెలెక్ట్ చేసుకోవాలి.
లేకపోతే తాను అప్పటి వరకు పడ్డ కష్టం అంత కూడా వృధా అవుతుంది.
ఇక ఏ నిర్మాతకు తన కథ వినిపించిన అది బిజినెస్ చేయగలదా? ప్రాఫిటబుల్ అవుతుందా ? లేదా ? అని ఆలోచిస్తారు.
సినిమా ఒప్పుకున్నా హీరో తన ఇమేజ్ కి తగ్గట్టు ఉందా, ట్రెండ్ కి తగ్గట్టు ఉంటుందా ? అలాగే అతడి చుట్టూ భజనపరులు, వంతపాడే వారు ఇలా అందరు ఎదో ఒకటి చెప్తూ హీరోలను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు.
"""/"/
అయితే ఎవరికీ నచ్చిన సూచనా వాళ్ళు చేస్తూ స్క్రిప్ట్ నానా పెంట చేస్తారు కానీ దర్శకుడిని నమ్మి కథను అలాగే ఒకే చెప్పే హీరోలు చాల తక్కువ ఉంటారు.
ఆలా ఒక కొత్త దర్శకుడికి సపోర్ట్ దొరకడం అనేది దాదాపు అసాధ్యం.ఆలా అన్ని అవాంతరాలు దాటుకొని మహాపర్వతం లాంటి అడ్డంకుల్ని గెలిచి తీరా సినిమా తీసాక చాలా ఈజీ గా పెదవి విరిచేస్తారు.
అందుకు బోలెడన్ని రివ్యూలు, కారణాలు చెప్తూ ఉంటారు.ఇక బాల సేతు సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఆయనకు ఇప్పటి వరకు చెప్పిన అన్ని కష్టాలు బాలు అనుభవించాడు.
ఈ సినిమా మొదట 1997 లో షూటింగ్ మొదలయ్యింది.అప్పటి నుంచి ఎన్నో ఆటంకాలను ఎదురయ్యాయి.
"""/"/
చాల చిన్న బడ్జెట్ తో సేతు సినిమా మొదలయ్యింది.షూటింగ్ ముహూర్తం కోసం పొద్దున్నే పూజ చేసి మొదలెట్టగా ఏవో కారణాల చేత సాయంత్రం షూటింగ్ ఆగిపోయింది.
ప్రొడ్యూసర్ లేకపోవడం ఆ కథను చాల మందికి వినిపించాడు బాల.కానీ ఎవరు చేయడానికి ముందుకు రాలేదు.
బాల ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా కంద స్వామి ముందుకు వచ్చాడు.కథ కూడా వినకుండా ఒకే చేసి సినిమా మొదలెట్టాక పెప్సీ యూనియన్ స్ట్రైక్ వల్ల షూటింగ్ ఆగిపోయింది.
స్ట్రైక్ అయ్యాక ప్రొడ్యూసర్ సినిమాను ఆపేసాడు.విక్రమ్, బాల, బాల అస్సిటెంట్ అమీర్ సుల్తాన్ వెళ్లి కంద స్వామి ని బ్రతిమిలాడి ఒప్పించి 1998 లో షూటింగ్ పూర్తి చేయించారు.
ఇక సినిమా ప్రమోషన్ కోసం ఒక్క రూపాయి కూడా పెట్టలేనని ప్రొడ్యూసర్ చెప్పడం తో విక్రమ్ తన భార్య ఇచ్చిన డబ్బు తో ప్రమోట్ చేసారు.
22 సార్లు గ్రాండ్ స్లామ్స్ ఛాంపియన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ రిటైర్..