ఇళయ దళపతి విజయ్ భార్య సంగీత గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

మొన్నటివరకు కోలీవుడ్ లో మాత్రమే స్టార్ హీరో గా కొనసాగిన విజయ్ దళపతి ఆ సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం తెలుగులో కూడా స్టార్ హీరోగానే కొనసాగుతున్నారు విజయ్ దళపతి.

కోలీవుడ్ ప్రేక్షకులు ఎదురు చూసినట్లు గానే టాలీవుడ్లో కూడా ఎంతో మంది అభిమానులు ఈ సినిమా కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు.

ప్రముఖ దర్శకుడు ఎస్ ఎ చంద్రశేఖర్ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన విజయ్ నాలిమై తీర్పు అనే సినిమాతో హీరోగా పరిశ్రమకు పరిచయం అయ్యాడు.

హీరోగా ఎన్ని సినిమాలు చేసినప్పటికీ మొదట్లో మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోయాడు.ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చిన విజయ్ సూపర్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు.

ఇక ఇప్పుడు విజయ్ చేసిన ప్రతి సినిమా సూపర్డూపర్ విజయాన్ని సాధిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇలా కోలీవుడ్ లోనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా మారిపోయాడు.

ఇక ప్రేక్షకులందరికీ తన నటనతో ఇళయదళపతి గా మారాడు విజయ్.కాగా 1999లో సంగీత అనే అమ్మాయినీ విజయ్ పెళ్లి చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే.

ఏకంగా తన కు వీరాభిమాని అయిన సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇక విజయ్ భార్య సంగీత గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

"""/"/ లండన్ లో స్థిరపడ్డ తమిళ కుటుంబంలో జన్మించింది విజయ్ భార్య సంగీత.

ఇక విజయ్ సినిమాలు చూస్తూ హీరో విజయ్ కి వీరాభిమాని గా మారిపోయింది.

ఇక ఒకానొక సమయంలో హీరో విజయ్ ని చూడటానికి ఏకంగా లండన్ నుంచి చెన్నైకి వచ్చింది సంగీత.

ఇక తనకు తెలిసిన వారి ద్వారా విజయ్ కలిసింది.సినిమాల్లో చెప్పే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అటు విజయ్ జీవితంలో కూడా నిజం అయ్యింది.

అభిమానిగా విజయ్ ని కలవడానికి వచ్చిన సంగీత ని చూసి ఒక్కసారిగా లవ్ లో పడిపోయాడు విజయ్.

ఇక ఆ తర్వాత ఇద్దరూ ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకోవడం ఫోన్లో మాట్లాడుకోవడం కూడా జరిగింది.

ఇక ఆ తర్వాత విజయ్ తండ్రి కి ఈ విషయం తెలిసి మా వాడిని పెళ్లి చేసుకుంటావా అని సంగీతను నేరుగా అడిగేశరట.

ఇందుకు సంగీత ఓకే చెప్పడంతో 1999 ఆగస్టు 25వ తేదీన వివాహం ఎంతో ఘనంగా జరిగింది వీరికి ఒక కొడుకు కూతురు ఉన్నారు.

పోటెత్తుతోన్న ఎన్ఆర్ఐ పెట్టుబడులు .. త్రివేండ్రంలో రియల్ ఎస్టేట్ బూమ్