సూపర్ స్టార్ కృష్ణ కామెంట్ చేయగానే.. అల్లు రామలింగయ్య దండం పెట్టారట తెలుసా?

సినీ ప్రముఖులకు సంబంధించిన ఏ వార్త అయినా ప్రేక్షకులలో ఎప్పుడూ ఆసక్తి పెరిగిపోతూనే ఉంటుంది.

సినీ ప్రేక్షకుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగిందంటే అదే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.

ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ ఒకప్పటి స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య మధ్య జరిగిన సంభాషణ ఇటీవల తెర మీదికి వచ్చి హాట్ టాపిక్ గా మారింది.

మద్రాసులోని వాహినీ స్టూడియోలో పదో ఫ్లోర్లో చందమామతో బిళ్ళంగోడు ఆడినట్లు దిక్కులని అనే పాట వినిపిస్తుంది.

కృష్ణ జయప్రద, గీత,జ్యోతి లక్ష్మి లకి డాన్స్ ఎలా చేయాలో చెబుతున్నారు కొరియోగ్రాఫర్ శీను.

ఇలాంటి సమయంలోనే అల్లు రామలింగయ్య ఒక లాల్చీ ధరించి భుజం మీద కండువా వేసుకుని అక్కడికి వచ్చారట.

దీంతో ఇది చూసిన కృష్ణ ఏంటి రామలింగయ్య గారు ప్రేమాభిషేకం గెటప్ వేసుకొని వచ్చారు.

పాపారాయుడులా ఫోజు కొడుతున్నారు హీరో అవుదామని ట్రై చేస్తున్నారా ఏంటి.నేను ఇప్పుడే రామారావు నాగేశ్వరావు గార్లకు ఫోన్ చేసి చెబుతాను అంటూ ఆటపట్టించాడట కృష్ణ.

ఇక వెంటనే అందుకున్న అల్లు రామలింగయ్య అయ్యా మీరు హీరోలు మేం కమెడియన్స్ సినిమాల్లో ఎలాగో ఏడిపిస్తారు మమ్మల్ని మామూలుగా ఉండనివ్వండి అయ్యా అంటూ మందు కొట్టిన వాడిలా మాట్లాడారట అల్లు రామలింగయ్య.

"""/" / ఇక అంతలో కల్పించుకున్న డైరెక్టర్ ఏవండి రామలింగయ్య గారు మే షాట్ మొదలు కావడానికి ఇంకా అరగంట సమయం ఉంది.

ఇప్పటినుంచే తాగుబోతుల మూడ్ లో మీరు ఉండాల్సిన అవసరం లేదు.షాట్ తీసే ముందు చెబుతాను అని అన్నారట దర్శకుడు చంద్రశేఖర్ రెడ్డి.

అంతలో కృష్ణ అందుకుని ఏంటి రామలింగయ్య గారు తాగుబోతు మూడో లో సాంగ్ పాడతారా అంటూ అడిగారట.

ఇక దర్శకుడు స్పందిస్తూ అవునండి ఈ సినిమాలో ఆయనకు అమ్మాయిలంటే బాగా మోజు.

కనిపించే ప్రతి అమ్మాయి వెంటపడుతుంటాడు.చివరికి ఓ రోజు పెళ్ళి చూపులకు వెళ్తుంటే అది కూడా ఆగిపోతుంది.

దీంతో మనసు గతి ఇంతే అంటు మందు చేత్తోపట్టుకుని బాధపడే బిట్స్ తీయాలి.

ఆ తర్వాత డాన్సర్ జ్యోతిలక్ష్మి ఫోజు చూసి భలే మంచి రోజు ఖరీదైన ఫోజు అంటూ వెంట పడే షాట్స్ తీయాలని చంద్రశేఖర్రెడ్డి వివరించారట.

ఓహో అదన్నమాట సంగతి.ఎందుకు ఇంత పోజు కొడుతూ సెట్ లోకి వచ్చారా అనుకున్నాను అంటూ కృష్ణ సరదాగా కామెంట్ చేశారట.

అప్పుడే రామలింగయ్య గారు అందుకని.అయ్యా ఆ విషయం వదిలేయండి.

పడక పడక నీ కళ్ళలోనే పడ్డాను అంటూ దండం పెట్టారట.

మేఘాలలో భయంకరమైన ఆకారాలు.. వీడియో చూస్తే వణుకు పుడుతుంది!