ఆ కుర్రాడు కోసం శోభన్ బాబు ఎందుకు వాదులాడాడు ?

మధుసూదనరావు.ఒకప్పుడు టాప్ డైరెక్టర్.

తన దగ్గర ఓ కుర్రాడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.తనంటే మధుసూదనరావుకు ఎంతో నమ్మకం.

అందుకే తను షూట్ చేయాల్సి పలు సీన్లు, పాటలను ఆ కుర్రాడికి అప్పజెప్పేవాడు.

వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పేవాడు.సేమ్ అలాగే శోభన్ బాబు హీరోగా మల్లెపువ్వు సినిమా మొదలయ్యింది.

కొన్ని పాటలను కాశ్మీరులో చిత్రీకరించాలి అనుకున్నారు.సరిగ్గా అదే సమయంలో దర్శకుడు మధుసూదనరావుకు అనారోగ్య సమస్యలు వచ్చాయి.

దీంతో ఆయన కాశ్మీర్ పర్యటనకు రానని చెప్పాడు.అదేంటి దర్శకుడు లేకుండా షూటింగ్ ఏంటని హీరోతో పాటు నిర్మాతలు కంగారు పడ్డారు.

అప్పుడే ఆఫీసులోకి అడుగు పెట్టిన దర్శకుడు.నువ్వెళ్లి తీసుకురారా.

అని చెప్పాడు.నిర్మాతలు ఆ మాట విని షాక్ అయ్యారు.

ఆ కుర్రాడంటే శోభన్ బాబుకు నమ్మకం చాలా ఎక్కువ.అందుకే తను ఓకే చెప్పాడు.

కానీ నిర్మాతలకు ఇష్టం లేకపోయినా.ఓకే చెప్పారు.

కొద్ది రోజుల్లోనే కాశ్మీరులో చక్కటి లొకేషన్లు.అక్కడ షూటింగ్ కు ఏర్పాట్లు అయ్యాయి.

అందరూ అక్కడికి చేరుకున్నారు.షూటింగ్ మొదలయ్యింది.

శోభన్ బాబు, లక్ష్మి అక్కడే ఉన్నారు.అయినా ఆ కుర్రాడు ఎలాంటి బెణుకు లేకుండా తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు.

అయితే ఆ సినిమా కెమెరా మెన్ వెంకటరత్నం ఇగో హర్ట్ అయ్యింది.ఆరోజుల్లో ఆయన పెద్ద కెమెరా మెన్.

శోభన్ బాబును ఏరా అని పిలిచేంత చనువు ఉన్న వ్యక్తి.అప్పుడే శోభన్ బాబుతో వెంకటరత్నం.

ఈ వెధవ చూడు అప్పుడు పెత్తనం చూపిస్తున్నాడు అన్నాడు.ఆ మాటలు శోభన్ బాబుకు నచ్చలేదు.

కోపంతో అతడు తప్పకుండా పెద్ద దర్శకుడు అవుతాడు రా.అతడితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు.

"""/"/ ఆ కుర్రాడి విషయంలో వెంకటరత్నం- శోభన్ బాబు మధ్య వాదన జరిగింది.

వీరి మధ్య ఈ గొడవ చాలా దూరం వెళ్లింది.ఆ కుర్రాడు దర్శకుడు కాలేడని వెంకటరత్నం, అవుతాడని శోభన్ బాబు పందెం కాశారు.

ఇద్దరు బాండ్ పేపర్ కూడా రాసుకున్నారు.నాలుగేళ్ల తర్వాత శోభన్ బాబు నమ్మకం నిజమైంది.

ఆ కుర్రాడు పెద్ద దర్శకుడు అయ్యాడు.తను మరెవరో కాదు.

ఫేమస్ డైరెక్టర్ కోదడంరామిరెడ్డి.తన మాట తప్పైనందుకు వెంకటరత్నం పశ్చాత్తాపం చెందాడట.

2025 లో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇవ్వనున్న నందమూరి వారసులు…