శ్రీదేవిని రామానాయుడు ఎందుకు ఎత్తుకొని వెళ్లాడో తెలుసా?
TeluguStop.com
అతిలోక సుందరి శ్రీదేవి.టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని పరిశ్రమల్లో అద్భుత సినిమాలు చేసింది.
జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.తెలుగులో ఆమె చేసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాయి.
తన అద్భత సినిమాలో అందరి చేత శభాష్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ.అయితే ఓ సినిమా షూటింగ్ సమయంలో లెజెండరీ నిర్మాత రామానాయుడు ఆమెను ఎత్తుకుని కొంత దూరం నడిచాడట.
ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.అందాల తార శ్రీదేవి తెలుగులో దాదాపు అందరు హీరోలతో సినిమాలు చేసింది.
చిరంజీవి- శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ సాధించాయి.
ఆ తర్వాత శోభన్ బాబు- శ్రీదేవి జంటగా నటించిన పలు సినిమాలు కూడా ఓ రేంజిలో విజయం సాధించాయి.
వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన దేవత సినిమా సంచలన విజయం సాధించింది.ఈ సినిమాలో అద్భుతమైన పాటలు చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి.
వేటూరి రాసిన వెళ్లువచ్చి గోదారమ్మా అనే పాట ఆల్ టైం హిట్ సాధించింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు సంచలనాలు క్రియేట్ చేస్తూనే ఉంది.ఉభయ తెలుగు రాష్ట్రాలను ఈ పాట ఊపు ఊపింది.
"""/"/
ఈ పాటను రాజమండ్రి సమీపంలోని అగ్రహారంలో షూట్ చేశారు.గోదావరి తీర ప్రాంతంలో ఈ షూటింగ్ కొనసాగింది.
దేవత సినిమా యూనిట్ అంతా గోదావరి నదిపై బోటులో ప్రయాణించింది.అక్కడి నుంచి కొంత దూరం బురదలో నడిచి లొకేషన్ కు వెళ్లాల్సి ఉంటుంది.
విగతావాళ్లంతా బురదలో నడిచారు.కానీ శ్రీదేవి మాత్రం వెళ్లిలేకపోయింది.
తను బురదలో నడిస్తే వేసుకున్న డ్రెస్ కు అంటుకుంటుందని అనుకుంది.ఇదే విషయాన్ని నిర్మాత రామా నాయుడుకు చెప్పింది.
దీంతో తనను ఎత్తుకుని లొకేషన్ స్పాట్ వరకు తీసుకెళ్లాడు ఆయన.అనంతరం పాట షూటింగ్ జరిగింది.
ఈ సినిమా 1982లో విడుదలై సంచలన విజయం సాధించింది.
పాకిస్థానీ లవర్ కోసం కరాచీ వెళ్లిన అమెరికన్ లేడీ.. తర్వాతేమైందో తెలిస్తే షాకే..?