అద్భుతమైన ట్యాలెంట్..కానీ అవకాశాలే నిల్లు..పాపం ఈ కమెడియన్
TeluguStop.com
ఒళ్ళంతా కామెడీ.అదిరిపోయే పంచులు, కేవలం ఎక్సప్రెషన్స్ తోనే నవ్వించే మహాద్భుతమైన టైమింగ్.
ఇన్ని ఉన్నా కూడా కొంతమందికి సరైన టైం లో బ్రేకింగ్ రాదు.అలంటి ఒక కమెడియన్స్ లో తెలుగు తెరకు దొరికిన ఒక ఆణిముత్యం నటుడు సత్య.
అమలాపురం లో పుట్టి పెరిగిన సత్య బి టెక్ చదివాడు.సినిమాల్లో నటించాలనే కోరికతో ఇండస్ట్రీ కి వచ్చిన సత్య కి మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే అవకాశం లభించింది.
జె కరుణ్ కుమార్ దర్శకత్వం లో నితిన్ హీరోగా నటించిన ద్రోణ సినిమాకు 2009 లో సహాయ దర్శకుడిగా పని చేసాడు.
ఆ తర్వాత అమృతం వంటి సీరియల్ కి సైతం సహాయ దర్శకుడిగా వ్యవహరించాడు.
ఆ తర్వాత నిఖిల్ హీరోగా వచ్చిన కళావర్ కింగ్ సినిమాకు సైతం అసిస్ట్ చేసాడు.
ఇక ఆ తర్వాత కమెడియన్ గా మారి పిల్ల జమిందార్ సినిమాలో పులకేశి పాత్రలో చక్కగా నటించాడు.
ఇక అక్కడ నుంచి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు సత్య కి.ఆ తర్వాత చలో, కార్తికేయ, గద్దల కొండా గణేష్ వంటి సినిమాల్లో మంచి టైమింగ్ ఉన్న కామెడీ తో నవ్వించాడు.
ఇక 2009 నుంచి 2022 వరకు దాదాపు 80 సినిమాల్లో కమెడియన్ గా నటించిన సత్య ఈ ఏడాది మరి కొన్ని సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి వస్తున్నాడు.
"""/"/
ఇక టాలీవుడ్ లో సీనియర్ కమెడియన్స్ అతి తక్కువ కాలంలో చనిపోవడం తో కొంత కమెడియన్స్ కొరత ఉంది.
బ్రహ్మానందం లాంటి కమెడియన్స్ రిటైర్ అవ్వడం వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్స్ ఎక్కువగా డిమాండ్ చేయడం తో చిన్న కమెడియన్స్ ని పెట్టి చాల సినిమాలను లాగిస్తున్నారు.
అందులో సత్య లాంటి నటుడికి అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఎందుకో గాని ఇప్పటికి ఒక సరైన పాత్ర పడలేదు అనేది చాల మంది అభిప్రాయం.
"""/"/
ఇక కమెడియన్ కాస్త ఆ మధ్య హీరోగా కూడా మారాడు.2021 లో వివాహ భోజనంబు సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చిన ఇప్పటికి ఒక అండర్ రేటెడ్ ఆర్టిస్ట్ గానే సత్యను సినిమా ఇండస్ట్రీ చూస్తుంది.
ఒక మంచి పాత్ర కనుక వస్తే అద్భుతంగా నటించి టాలీవుడ్ లో తిరుగులేని స్థాయికి చేరుకునే సత్తా పక్కాగా ఉన్న నటుడు సత్య.
ఇక చిరు భోళా శంకర్ సినిమాలో కూడా సత్య నటిస్తుండటం విశేషం.
ఆ సమయంలో చనిపోతానని అనుకున్నా.. మనీషా కోయిరాలా కామెంట్స్ వైరల్!