వందల కోట్ల ఆస్థి.. లక్షల మందికి ఉద్యోగాలు.. రంభ భర్త గొప్పతనం తెలుసా ?

హీరోయిన్ రంభ గురించి, ఆమె సినిమాల గురించి, వైవాహిక జీవితం గురించి కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో, అనేక వెబ్ సైట్స్ లో రాసారు.

మనం కూడా చూస్తూనే ఉన్నాం.అయితే రంభ వ్యాపారాల గురించి ఆమె భర్త కంపెనీల గురించి మాత్రం చాల తక్కువగానే తెలుసు అని చెప్పాలి.

46 ఏళ్ళ వయసులో కూడా చెక్కు చెదరని అందంతో కుర్ర కారు మతులు పోగోడుతన్న రంభ 2010 లో చెన్నై కి చెందిన వ్యాపార వేత్త ఇంద్రకుమార్ పాత్మనాథన్ అనే వ్యక్తి ని పెళ్లి చేసుకుంది.

వీరికి ముగ్గురు పిల్లలు.ఇక అసలు విషయానికి వస్తే రంభ భర్త అయినా ఇంద్ర కుమార్ వ్యాపారాల్లో ఎంతో ఆరితేరిన వ్యక్తి.

ఎన్నో వందల కోట్ల ఆస్తికి అధిపతి.చిన్న వయసులోనే ఎంతో చురుకుగా ఉంటూ 2003 లోనే ఇండియాలోనే అతి పెద్ద వ్యాపార సంస్థ అయినా మ్యాజిక్ వుడ్స్ అనే కంపెనీ ని స్థాపించి దాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విస్తరించాడు.

కేవలం ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా ఈ కంపెనీకి బ్రాంచెస్ ఉండటం విశేషం.

ఎక్కువ జీవితం విదేశాల్లోనే ఉంటూ వ్యాపారాలు విస్తరిస్తూ కొన్ని లక్షల మందికి నేరుగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కలిపిస్తున్నాడు.

"""/"/ ఇక కేవలం మ్యాజిక్ వుడ్స్ అనే కంపెనీ విజయవంతం కావడంతో కేవలం రెండేళ్లలోనే ఒక ఎక్స్పోర్ట్ కంపెనీ ని కూడా స్థాపించాడు.

ఇక ఆ తర్వాత మరొక నాలుగు ఏళ్లకు ఇండికా ఎక్సిమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ని కూడా స్థాపించాడు.

ఇక ఏడాదికే రంభ ని పెళ్లి చేసుకున్నాడు.ఇద్దరు కూతుళ్లు పుట్టాక ఏమైందో ఏమో రంభ మరియు ఇంద్ర కుమార్ మనస్పర్థలతో విడాకుల వరకు వెళ్ళాడు.

ఆ తర్వాత మళ్లి ఇద్దరి మధ్య సయోధ్య కుదరగా లాక్ డౌన్ కి ముందు ఒక కొడుకు కూడా పుట్టాడు.

ఇక అదే సమయంలో రంభ పేరు పైన రంభ లైఫ్ స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ని కూడా నెలకొల్పి భార్య పై అతడికి ఉన్న ప్రేమను చాటుకున్నాడు.

బాలయ్య వ్యక్తిత్వం గొప్పది.. డైరెక్టర్ బాబీ కామెంట్స్ వింటే మాత్రం ఫిదా అవ్వాల్సిందే!