నరేష్ రెండవ భార్య రేఖ సుప్రియ కొన్ని కోట్ల మందికి ఆదర్శం అని మీకు తెలుసా ?

నరేష్ రెండో భార్యగా ఏమాత్రం బయట ప్రపంచానికి పరిచయం లేదు రేఖ సుప్రియ.

ఆమె ఎంతో ఉన్నత కుటుంబంలో జన్మించింది.ప్రముఖ గేయ రచయిత, అభ్యుదయ వాది అయిన దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రికి మనవరాలు అంతేకాదు బుజ్జాయి రచయిత అయినటువంటి సుబ్బరాయ శర్మకు కుమార్తె.

రేఖ సుప్రియ సోదరుడు సోదరి అలాగే కుటుంబమంతా కూడా రచనలు చేసేవారు.రేఖ సుప్రియ తండ్రి సుబ్బరాయ శర్మకు విజయనిర్మలకు మంచి స్నేహం ఉండేది అందుకే నరేష్ కి పెళ్లి చేయాలని ఆమె కోరుకుంది మొదట్లో ఒప్పుకోకపోయినా ఆ తర్వాత సరే అన్నారు.

పెళ్లి జరిగింది.ఇద్దరు పిల్లలు పుట్టారు.

రేఖ సుప్రియ కు నవీన్ మరియు తేజ అనే ఇద్దరు పిల్లలు పుట్టాక నరేష్ తో విడాకులు తీసుకుంది.

అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల ముఖ్య కారణం తేజ ఆటిజం అనే సమస్యతో జన్మించడమే అతడి చిన్నతనంలో మంద బుద్ధితో ఉండేవాడు ఈ మధ్య పిల్లల్లో ఆటిజం సమస్య ఎక్కువగా కనిపిస్తుంది వారి శరీరం ఎదుగుతుంది కానీ మెదడు మాత్రం ఎదగదు అందుకే వారి పనులు వారు చేసుకోలేరు భోజనం కూడా చేయలేరు ఎంత వయసు వచ్చిన ఆ చిన్నపిల్లల్లా నే ప్రవర్తిస్తూ ఉంటారు తేజ ఆటిజం సమస్యతో ఉన్నాడని తెలియగానే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి ఆ తర్వాత ఆ విడిపోవాల్సి వచ్చింది.

నవీన్ కస్టడీ కోరుతూ నరేష్ కేసు వేయడంతో అతడు తన తండ్రి దగ్గర ఉండాల్సి వచ్చింది ఇక చిన్న పిల్లోడిని మాత్రం రేఖ సుప్రియ దగ్గర ఉండి పెంచింది.

"""/"/ ఇక ఆ కొడుకు బాధ చూసి తల్లడిల్లిపోయిన రేఖ తన కొడుకు లాగా తన లాగా ఎవరు ఇబ్బంది పడకూడదని నిర్ణయించుకుంది.

అందుకే ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించింది ఆ సంస్థ ద్వారా ఆటిజం సమస్యతో బాధపడుతున్న వారికి ఉపాయాలు చెప్పేవారు అంతేకాదు ఆటిజంతో బాధ పడుతున్న 25 మంది అనాధ పిల్లలను ఆమె దత్తత తీసుకున్నారు.

వారి బాగోగులు చూడటమే కాదు ఎంతో పెద్ద స్కూల్లో వారిని చదివిస్తున్నారు ఇక తేజా ప్రస్తుతం పూర్తిగా మామూలు వ్యక్తి అయ్యాడు మంచి పెయింటర్ గా ఎదిగాడు ప్రస్తుతం అతడు వేస్తున్న పెయింటింగ్స్ లక్షల్లో అమ్ముడుపోతున్నాయి.

పెద్ద కంపెనీలు వాటిని కొనుగోలు చేస్తాయి.ఇలా కొడుకును సమస్య నుంచి బయట పడేయడమే కాకుండా ఎంతోమందికి భవిష్యత్తు కల్పిస్తున్న రేఖ కొన్ని కోట్ల మందికి ఆదర్శమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సుకుమార్ కావాలనే రామ్ చరణ్ కోసం అలాంటి కథను రెడీ చేశాడా..?