Kavya Kalyan Ram: పర్వాలేదే ….. 30 ఏళ్ల వయసులో ఈ గంగోత్రి చిన్నది అవకాశాలు బాగానే పట్టుకుంటుంది..!
TeluguStop.com
కావ్య కళ్యాణ్ రామ.గంగోత్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా పాపులర్ గా మారిపోయింది ఈ కావ్య( Kavya).
ఇప్పటికీ గంగోత్రి చిన్నారి ఎలా ఉంటుందో తెలుసా అని ఎంతో మంది యూట్యూబ్లో వీడియోలు చేస్తూనే ఉంటారు.
1991లో పుట్టిన కావ్య కి ప్రస్తుతం 32 ఏళ్ల వయసు.2001 వ సంవత్సరంలో స్నేహమంటే ఇదేరా(Snehamante Idera) సినిమాతో తొలిసారి నటన రంగంలోకి అడుగు పెట్టింది కావ్య.
ఈ సినిమాలో ఆమె పాత్ర పెద్దగా లేకపోయినా ఆ తర్వాత కావ్య నటించిన గంగోత్రి, అడవి రాముడు, ఠాగూర్(Gangotri, Adavi Ramudu,Adavi Ramudu) వంటి సినిమాలు ఆమెకు చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఇక కొంత వయసుకు వచ్చిన తర్వాత చైల్డ్ ఆర్టిస్టులకు కాలం చెల్లిపోతుంది అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు యుక్తవయసు వస్తున్నా కొద్దీ వారిలో పసితనం తాలూకా ఛాయలు కనుమరుగవుతాయి దాంతో అటు చైల్డ్ ఆర్టిస్ట్ గా కాకుండా ఇటు హీరోయిన్ గా కాకుండా మధ్యలో మిగిలిపోతూ ఉంటారు.
"""/" /
అయితే చిన్నతనంలో ఏదో కొన్ని సినిమాలు నటించానులే అనుకుందో ఏమో తెలియదు కానీ ఆమె ఆ తర్వాత ఆ నటనను పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు.
అందుకే పూణేలో లా చదివి లాయర్ గా ప్రాక్టీస్ చేయాలని అనుకుంది కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram).
కానీ డెస్టిని అందరికీ ఒకేలా ఉండదు కదా అసలు సినిమాలు చేయకూడదు అనే నిర్ణయించుకున్న కావ్య అనుకోకుండా చాలా లేటు వయసులో హీరోయిన్ గా పరిచయం అయింది.
దాదాపు ఆమెకు 30 ఏళ్ల వయసు వచ్చాక మసూదా(Masooda) సినిమాలో తొలిసారి హీరోయిన్ గా నటించింది.
"""/" / ఇక ఇప్పుడు బలగం(Balagam) సినిమాలో కూడా ప్రియదర్శి( Priyadarshi) సరసన హీరోయిన్ గా నటించిన కావ్య ప్రస్తుతం టాలీవుడ్ దృష్టి లో పడిందనే చెప్పాలి.
కావ్య ఇంత లేటుగా సినిమా ఇండస్ట్రీకి రావడం పట్ల అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు ఇప్పటికే డజన్ కి పైగా సినిమాలు చేయాల్సిన కావ్య లేటుగా ఇంట్రడ్యూస్ అయ్యింది అంటూ వాపోతున్నారు.
"""/" /
బలగం మసూద సినిమాల వల్ల ఆమెకు పాపులారిటీ కూడా బాగానే పెరుగుతోంది కావ్య అతి త్వరలో మరికొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయి.
బలగం సినిమా హిట్ అయిన తర్వాత ఆమెకు ఇండస్ట్రీ నుంచి వరుస అవకాశాలు వస్తున్నాయట అయితే సినిమాల విషయంలో ఆమె అభిప్రాయం కాస్త అటు ఇటుగా ఉంది.
తెలంగాణలోనే(Telangana) పుట్టిన కావ్య ఒక సరైన సినిమా పడితే ఎక్కడికో వెళ్ళిపోతుంది.మరి అలాంటి ఒక మంచి సినిమా పడి కావ్య స్టార్ హీరోయిన్ అవ్వాలని కోరుకుందాం.
మీ దగ్గర కర్రీ స్మెల్ రాకూడదా.. ఈ ఎన్నారై మహిళ చిట్కాలు తెలుసుకోండి..!