సాయి కుమార్ కుటుంబం తో సహా ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకున్నారు..ఆపింది ఎవరు ..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు హీరోగా గుర్తింపు పొందిన తర్వాత సినిమా లో హీరోగా చేసుకోకుండా ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు తీయడం లాంటివి చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఇటు హీరోగా కెరీర్ నాశనం అవుతుంది అటు ఫైనాన్షియల్ గా నష్టపోతూ ఉంటారు.

అందుకే హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఒక ప్లానింగ్ ప్రకారం ఇండస్ట్రీలో నడుచుకోవాలని చాలామంది చెప్తుంటారు.

ఇది అంతా ఎందుకు చెప్తున్నాను అంటే డైలాగ్ కింగ్ అయిన సాయి కుమార్ పోలీస్ స్టోరీ సినిమా తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత ఈశ్వర్ అల్లా అనే సినిమాని చేస్తూ తనే హీరోగా నటించాడు.

"""/"/ సాయి కుమార్ వాళ్ళ నాన్న పి.జె.

శర్మ ఆయన కూడా తెలుగులో చాలా సినిమాల్లో నటించాడు.ఈశ్వర్ అల్లా సినిమా మొత్తం పూర్తి అయిపోయింది రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేసారు బయటకు వచ్చి కొనుక్కునే టైంకి వీళ్లు స్టూడియోలకు ఇచ్చే డబ్బులు అలాగే టెక్నీషియన్స్ కి ఇచ్చే డబ్బులు ఇంకా ఇవ్వలేదు దాంతో సినిమా రిలీజ్ అవ్వడం కొంచెం కష్టంగా మారింది అలాంటి టైంలో సాయి కుమార్ వాళ్ళ తండ్రి అయిన పి.

జె.శర్మ సినిమా అనుకున్న రోజు అనుకున్న టైంకి రిలీజ్ అవ్వకపోతే నేను ప్రాణాలతో ఉండను సూసైడ్ చేసుకుని చనిపోతాను అని చెప్పాడు సరిగ్గా అదే టైంకి సాయి కుమార్ వాళ్ళ భార్య తో కూడా నాన్న ఎందుకో ఫోన్ చేసాడు తను ఈ ఫోన్ లో మాట్లాడుతూ పైన ఉన్న ఫోన్ లో సురేఖని వినమని చెప్పాడు.

దాంతో ఆమె రిసీవర్ తీసుకొని వింటూ ఉంటే పి జె శర్మ సూసైడ్ చేసుకుంటా అనే మాటలు వినడంతో సాయి కుమార్ కి ఏం చేయాలో అర్ధం కాక ఏడుస్తూ కూర్చున్నాడు.

"""/"/ అప్పుడు భార్య సురేఖ నెక్స్ట్ డే మార్నింగ్ దాసరి నారాయణరావు గారితో మీటింగ్ అరేంజ్ చేసి మొత్తం మీద కట్టాల్సిన డబ్బులు రెండు కోట్లు అని తేలింది దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సాయికుమార్ ఆలోచిస్తున్నప్పుడు తన పక్కనే కూర్చున్న సురేఖ దాసరి గారితో కడతాం సార్ అని చెప్పింది దాసరి గారు కూడా డబ్బులు అయితే కట్టి సినిమా రిలీజ్ చేయండి మీ డబ్బులు మీకు వచ్చేస్తాయని చెప్పాడు.

దాంతో డబ్బులు కట్టి సాయి కుమార్ ఈ సినిమాని రిలీజ్ చేశారు ఈ సినిమా అనుకున్నంత ఆడకపోవడంతో రెండు కోట్ల అప్పుని సాయికుమార్ ఐదు సంవత్సరాల టైమ్ తీసుకుని తీర్చుకుంటూ వచ్చేశాడు.

ఇప్పుడు సాయికుమార్ ఆ విషయం గురించి మాట్లాడుతూ ఆ రోజు కనుక ఫోన్ లో నాన్న మాట్లాడిన మాటలు నా భార్య సురేఖ వినకపోయి ఉంటే మా ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకునేవాళ్ళం అని చెప్తాడు.

అందుకే సాయికుమార్ తన భార్య అయిన సురేఖని వాళ్ళ అమ్మ తర్వాత అమ్మలా చూసుకుంటాడు.

"""/"/ సాయికుమార్ కి సురేఖా కి పెళ్లైన తర్వాత సాయి కుమార్ తనతో ఇలా చెప్పాడంట మనం అమ్మ నాన్నల తోనే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం అంత జాయింట్ ఫ్యామిలీ మనం సపరేటుగా ఉండడం వీలుకాదు నేను వర్క్ చేస్తే వచ్చిన డబ్బులు ఏమైన ఉంటే అవి అమ్మకి ఇస్తాను నువ్వు ఫీల్ అవకూడదు.

మా అమ్మ నాన్న ఉన్నంతకాలం వాళ్లే మనల్ని ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ చూసుకుంటారు అలాగని నేను నిన్ను తక్కువగా ఏమి చూడను నీకు ఉండే ప్రాముఖ్యత నీకు ఉంటుంది మా అమ్మ చూసుకునే అన్ని రోజులు ఇంటి బాధ్యత ఆవిడే చూసుకుంటుంది తర్వాత తనే ఆ బాధ్యతలు నీకు అప్పగిస్తుంది అప్పటివరకు మనం వాళ్ళు చెప్పినట్టే వినాలి.

అనగానే సురేఖ కూడా చాలా బాగా అర్థం చేసుకుని నడుచుకుందని వాళ్ళ అమ్మ తర్వాత ఇంటి బాధ్యత అంత ఆవిడ తీసుకొని ఇప్పటికి కూడా అమ్మ తర్వాత అమ్మలా తనని చూసుకుంటుందని సాయికుమార్ సురేఖ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ చెబుతూ ఉంటాడు.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది…