మాధవన్ ఇండియాలోనే అతి తక్కువ మంది నటులలో ఒకడు ..ఎందుకో తెలుసా..?

ఆర్ మాధవన్.భారతీయ నటులలో అత్యంత తక్కువ మంది సాధించిన ఘనత ఆరు లేదా ఏడుపు పైగా భాషలలో నటించడం అలాంటి ఘనత మాధవన్ కూడా సొంతం చేసుకున్నారు.

ఏకంగా ఏడు భాషలలో ఆయన నటుడుగా కొనసాగుతున్నారు.బీహార్ లోని జంషెడ్పూర్ లో పుట్టిన తమిళ బ్రాహ్మణుడు మాధవన్.

52 ఏళ్ల వయసులో ఉత్సాహంతో అనేక విభిన్నమైన పాత్రలలో నటిస్తూ రెండు ఫిలింఫేర్ అవార్డులతో పాటు తమిళనాడు రాష్ట్ర అవార్డు సైతం అందుకున్నారు.

అసలు పేరు రంగనాథన్ మాధవన్.  మాధవన్ తొలినాలలో టీవీ సీరియల్ లో నటించేవాడు చిన్న చిన్న ప్రకటనలలో కూడా నటించి చాలా పోరాటం చేసిన తర్వాతే 2000 సంవత్సరంలో బ్రేక్ అందుకున్నాడు.

"""/"/ మణిరత్నం తీసిన సినిమా అలై పాయుదై చిత్రంలో నటించిన తర్వాత మాధవన్ తమిళనాడు తో పాటు యావత్ దేశం లో గుర్తింపు పొందాడు.

ఆ తర్వాత రొమాంటిక్ హీరోగా మిన్నలే, డుం డుం డుం సినిమాల్లో నటించిన మాధవన్ రన్ సినిమాతో మొదటి కమర్షియల్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

తమిళంలోనే సినిమాలు తీయకుండా హిందీలో కూడా నటిస్తూ వచ్చాడు మాధవన్ 2010 తర్వాత హిందీలో బిజీ స్టార్ గా మారిపోయాడు.

ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు.మాధవన్ నటించిన సినిమా తెలుగులో చెలి పేరుతో విడుదలవగా అది ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది.

"""/"/ మాధవన్ లాంటి నటులు చాలా అరుదుగా ఉంటారు.మాధవన్ కేవలం నటనలోనే కాదు నిర్మాతగా కూడా మారి పలు సినిమాలను నిర్మించాడు.

ఇక ఆయన సరిత అని అమ్మాయిని పెళ్లి చేసుకోగా ఈ జంటకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

ఇతడు స్విమ్మింగ్ లో ఛాంపియన్ గా కొనసాగుతున్నాడు.ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు పోటీల్లో పాల్గొనే విజేతగా తండ్రి పేరును నిలబెడుతున్నాడు.

అందుకే మాధవన్ కేవలం తమిళ భాషకి పరిమితం కాదు అతడు దేశంలోనే అత్యుత్తమ నటులలో ఒకడుగా చెప్పుకోవచ్చు.

పబ్లిక్ లో తమను తాము ఎప్పుడూ తక్కువ చేసుకుని మాట్లాడే హీరోలు వీరే !