Karthik Ratnam : కార్తీక్ రత్నం…సరిగ్గా వాడుకోవాలి కానీ సాన పెట్టిన వజ్రం అవ్వగలడు
TeluguStop.com
కేరాఫ్ కంచెరపాలెం( C/o Kancharapalem ) సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి దొరికిన ఆణిముత్యం కార్తీక్ రత్నం( Karthik Ratnam ).
అందులో ఆశ పాశం అంటూ సాగిన పాట ద్వారా బాగా ఫెమస్ అయినా ఈ నటుడు ప్రస్తుతం టాలీవుడ్ సంచలన నటుడిగా మారిపోయాడు.
ఇప్పుడు హాట్స్టార్ లో ప్రసారం అవుతున్న వ్యవస్థ అనే ఒక వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ లో నటించిన కార్తీక్ గత ఐదేళ్లుగా సక్సెస్ కోసం కష్టపడుతున్నాడు.
అయితే కేరాఫ్ కంచెరపాలం సినిమా తర్వాత గాడ్స్ అఫ్ ధర్మపురి( Gods Of Dharmapuri ) అనే వెబ్ సిరీస్ లో నటించగా, కేరాఫ్ కాదల్ అనే ఒక తమిళ సినిమాలో కనిపించాడు.
"""/" /
ఆ తర్వాత అర్ధ శతాబ్దం, నారప్ప, రౌడీ బాయ్స్ అనే సినిమాల్లో నటించగా ఓ మస్తారు పేరు బాగే దక్కించుకున్నాడు.
ఇక ఈ ఏడాది మరో సినిమాలో కనిపించనున్న కార్తీక్ తెలుగు తో పాటు తమిళ ఇండస్ట్రీ పై కూడా దృష్టి సారించాడు.
నిజానికి తాతల పేర్లు చెప్పుకొని బ్యాగ్రౌండ్ అంటూ ఎంతో మంది వారసులు వస్తున్న కూడా వారికి లేని ట్యాలెంట్ కార్తీక్ సొంతం.
అయితే ఎందుకో కానీ ఆ రేంజ్ లో పెద్ద ప్రాజెక్ట్స్ లో కార్తీక్ ని ఎవరు తీసుకోవడం లేదు.
తనదైన రోజు మంచి కథ దొరికితే కార్తీక్ పెద్ద హీరో అవ్వడం లో ఎలాంటి సందేహం లేదు.
అయితే అతడేమి హీరో అవ్వాలని గిరి గీసుకొని కూర్చోవడం లేదు.మంచి పాత్ర దొరికితే చాలు అని అనుకున్నటున్నాడు.
అతడికి తగ్గట్టుగానే వచ్చే పాత్రలు కూడా నటనకు స్కోప్ ఉన్నవే కావడం విశేషం.
"""/" /
అయితే ఇలా చిన్న సినిమాల్లో నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాల కంటే కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ లో నటిస్తే ఫ్యాన్ ఇండియా హీరో అయిపోవచ్చు.
ఎందుకంటే మన తెలుగు లోనే అంత హీరోయిజం అంటారు కానీ మిగతా భాషల్లో ట్యాలెంట్ కి పెద్ద పీట వేస్తారు.
CA లాంటి కష్టమైనా చదువును పక్కన పెట్టి థియేటర్ ఆర్టిస్ట్ గా బొమ్మ లేని బొరుసు అనే ప్రదర్శన చేయగా అందుకు నంది అవార్డు( Nandi Award ) కూడా దక్కింది.
ఈ నాటకాన్ని ఇప్పటికే ముప్పై సిటీల్లో ప్రదర్శన ఇవ్వడం కోసం మెరుపు.ఇక ఈ 25 ఏళ్ళ నటుడికి బోలెడంత భవిష్యత్తు ఉంది కాబట్టి మంచి సినిమాలు చేయడానికి కూడా కాస్త టైం పట్టచ్చు.
టీడీపీ కి గవర్నర్ పదవి .. ఈ ముగ్గురిలో బాబు ఛాయిస్ ఎవరో ?