విశ్వనాధ్ గారి మాటకు ఎదురు చెప్తే ఏమైపోతారో ఈ సంఘటన తెలిస్తే అస్సలు నమ్మరు

తెలుగు చలన చిత్ర సీమలో ఎంత మంది డైరెక్టర్లు ఉన్నప్పటికీ చాలా ప్రత్యేకత ఉన్న డైరెక్టర్లు మాత్రం కొందరే ఉంటారు వాళ్లలో మొదటివారు కె విశ్వనాథ్ గారు.

ఆయన తీసిన ప్రతి సినిమా ఒక కళాఖండం ఆర్ట్ సినిమాలకు పెట్టింది పేరు విశ్వనాథ్ గారు.

దాసరి నారాయణరావు రాఘవేంద్రరావు లాంటి దర్శకులు కమర్షియల్ సినిమాలు తీస్తుంటే విశ్వనాధ్ గారు మాత్రం మొదటి నుంచి ఆర్ట్ సినిమాలు తీసేవారు.

పెద్ద హీరో హీరోయిన్ ఎవరు లేకుండా నాట్యానికి ప్రాధాన్యతనిస్తూ ఆయన తీసిన శంకరాభరణం సినిమా సంవత్సరంపాటు ఆడిందంటే ఆయన తీసే సినిమాల్లో స్టోరీ కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అలాంటి విశ్వనాధ్ గారు కమల్ హాసన్ తో చేసిన సాగర సంగమం సినిమా లో జీవితం లో అన్ని కోల్పోయినా ఒక మనిషి కథని చాలా బాగా చెప్పారు.

నాట్యం అంటే ఇష్టం ఉన్న మనిషి నాట్యంతో పాటు తన ప్రేమించిన అమ్మాయినీ కూడా కోల్పోవడం ఈ సినిమాలో చాలా గొప్పగా చూపించారు.

శుభ సంకల్పం సినిమా తో కమలహాసన్ లో ఉన్నటువంటి నటుణ్ని చాలా వైవిధ్యంగా ఆవిష్కరించారు.

చాలామంది కమల్ హాసన్ వైవిధ్యమైన నటుడు ఏ క్యారెక్టర్ అయినా అలవోకగా చేసేస్తాడు అని అందరూ అంటుంటారు కానీ కమల్ హాసన్ ని పెద్ద హీరోని చేయడానికి కృషి చేసిన దర్శకులలో విశ్వనాధ్ గారు మొదటి స్థానంలో ఉంటారు ఎందుకంటే కమల్ హాసన్ తో ఆయన తీసిన సినిమాలు అలాంటివి.

స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ నటనని అభినందించని వారు ఉండరు కానీ అలాంటి ఓ క్యారెక్టర్ నీ డిజైన్ చేసి విశ్వనాథ్ గారు ఆ క్యారెక్టర్ లో తను యాక్టింగ్ చేసి కమల్ హాసన్ కి చూపించి ఆ తర్వాత కమల్ హాసన్ తో యాక్టింగ్ చేయించుకున్నారు.

"""/"/ విశ్వనాధ్ గారికి యాక్టింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది స్వతహాగా ఆయన నటుడు కాబట్టే తన సినిమాల్లో ఆర్టిస్ట్ దగ్గర నుంచి తను అనుకున్న పర్ఫామెన్స్ రాబట్టే వాడు.

విశ్వనాథ్ తీసిన చిత్రాలలో చిరంజీవితో చేసిన స్వయంకృషి సినిమా గాని ఆపద్బాంధవుడు సినిమా గాని చిరంజీవి కెరీర్లో చాలా కీలకమైన సినిమాలు అని చెప్పొచ్చు.

అప్పటివరకు చిరంజీవి అంటే మాస్ హీరో గా పేరుపొందాడు కానీ పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న సినిమాలు ఎప్పుడు చేయలేదు ఈ రెండు సినిమాలతో తను కూడా కమల్ హాసన్ లాంటి ఆర్టిస్ట్ నే అని చిరంజీవి ఇండస్ట్రీ లో ప్రూవ్ చేశాడు.

అయితే ఇలాంటి మంచి అభిరుచి ఉన్న దర్శకుడు కె విశ్వనాథ్ గారు కెరీర్ మొదట్లో ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు అప్పుడు ఆదుర్తి సుబ్బారావు గారు కృష్ణ హీరోగా గాజుల కృష్ణయ్య అనే సినిమాను చేస్తూ ఉన్నారు సరిగ్గా అదే టైం కి సుబ్బారావు గారికి ఆరోగ్యం బాగోక పోవడం తో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు.

ఆరోజు కృష్ణ గారితో షూట్ ఉండడం వల్ల ఏం చేయాలో తెలియక సుబ్బారావు గారు దగ్గర అసిస్టెంట్ గా ఉన్న విశ్వనాధ్ నీ సినిమా షూట్ చేయమని చెప్పారు ఎందుకంటే అప్పుడు కృష్ణ గారు చాలా బిజీగా ఉండేవారు ఒక రోజు డేట్స్ మిస్ అయితే మళ్లీ డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమవుతుందని సుబ్బారావు గారు అలా చెప్పారు అప్పుడు కృష్ణ 3 షిఫ్టు లు చేసేవారు.

"""/"/ అయితే షూటింగ్ లో భాగంగా గిరిబాబు కి ఆ రోజు షూట్ ఉంది.

అప్పుడు డైరెక్టర్ రాకపోవడంతో విశ్వనాధ్ గారు సినిమా షూట్ చేస్తూ ఉండగా ఆయన గిరిబాబు క్యారెక్టర్ ను ఎలా చేయాలో చేసి చూపించేవారు మీరు చెప్పిన విధానం బాగానే ఉంది కానీ ముందు చేసిన సీన్లలో క్యారెక్టర్ బిహేవియర్ వేరేగా ఉండేది దాంతో ఇది చేస్తే బాగుంటుంది ముందు చేసింది దీనికి సింక్ అవ్వదు.

కాబట్టి నేను ముందే ఎలా చేశానో ఇప్పుడు కూడా అలానే చేస్తాను అని చెప్పడంతో విశ్వనాధ్ గారికి కోపం వచ్చి సరే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని చెప్పారు దాంతో షూట్ లో టేక్ చేస్తున్నప్పుడు గిరిబాబు గారు చెప్పేది వినిపించుకోకుండా విశ్వనాధ్ ఎందుకు ఇలా చేస్తున్నారు నేను చెప్పింది ఏంటి మీరు చేసేది ఏంటి అని అందరి ముందు అనడంతో గిరిబాబు అప్పటికి స్టార్ హీరోగా ఉన్నాడు.

గిరిబాబు దాన్ని కొంచెం అవమానంగా ఫీల్ అయ్యాడు.అప్పుడు నేను మీకు ముందే చెప్పాను కదా ఇలాగే చేస్తాను అని అని గిరిబాబు విశ్వనాథ్ గారితో చెప్పినా వినిపించుకోకపోవడంతో చిన్న గొడవ జరిగింది.

మళ్లీ విశ్వనాధ్ గారే కాంప్రమైజ్ అయ్యి సినిమా షూట్ నడిపించారు దాంతో అది మనసులో పెట్టుకున్న విశ్వనాథ్ గారు తను డైరెక్టర్ అయిన తర్వాత కూడా గిరి బాబును ఎప్పుడు తన సినిమాలో తీసుకోలేదు.

విశ్వనాథ్ గారు డైరెక్టర్ గా కాకుండా సినిమాల్లో ఆక్టింగ్ కూడా చేస్తారు అందరికీ తెలిసిన విషయమే.

బన్నీ అరెస్ట్ దేనికి సంకేతం.. సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండకపోతే చుక్కలే!