తనకు మించిన దానం చేయడం వల్ల సర్వం కోల్పోయిన కల్పనా మోహన్ రాయ్

మానవ సంబంధాలు అన్నీ కూడా ఆర్థిక సంబంధాలు అంటాడు కార్ల్ మార్క్స్.అదే నిజం కూడా అందుకు చక్కటి ఉదాహరణ హాస్య నటి కల్పనా రాయ్.

ఆమె తన జీవితంలో 450 కి పైగా సినిమాల్లో నటించినా కూడా చనిపోయే రోజుకి చేతిలో వంద రూపాయలు కూడా లేవు.

కానీ సత్యవతి అనే మహిళ ఓ రోజు రంగస్థలం నాటకాన్ని చూసి ఉండకపోతే ఈ రోజు కల్పనా రాయ్ అనే వ్యక్తి మనకు పరిచయం ఉండేది కాదు ఆమెకు అంత కష్టం వచ్చేది కాదు.

ఆమె నటి అయ్యేది కాదు సత్యవతి కల్పన రాయ్ యొక్క అసలు పేరు.

ఆమె సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరును కల్పన గా మార్చుకుంది.తన భర్త మోహన్ రాయ్ పేరుని తన పేరుకు తగిలించుకుని ఆమె కల్పనా రాయ్ అయింది.

ఓ రోజు ఇంటి ముందు వరండాలో కూర్చొని చదువుకుంటున్న సత్యవతికి మైక్ లో కొన్ని పాటలు, పద్యాలు వినబడ్డాయి.

ఆరోజు ఆమె ఇంటి దగ్గర రామాలయంలో ఒక నాటకాన్ని వేశారు.ఆ నాటకాన్ని చూసి ఆమె కూడా నటి నటించాలని పట్టుపట్టి భీష్మించుకొని కూర్చొని ఆ తర్వాత నటిగా తెరంగేట్రం చేసింది.

ఇక వారి ఊరి దగ్గరలో ఓ రోజు నటి శారద సినిమాకి సంబంధించిన షూటింగ్ జరిగింది.

వారం రోజులపాటు అక్కడే శారద బసు చేసింది.అక్కడ శారద ను కలవడానికి రోజు వందల్లో అభిమానులు వచ్చేవాళ్ళు.

ఆమెను చుసిన తర్వాత సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంది కల్పన. """/"/ ఓ రోజు కల్పన ఆరారోగ్యంతో ఉంది.

చాల కష్టంగా లేచి అన్నం వండుకుంటుంది.ఆ పుట తింటే రెండో పూటకు సరిపడా బియ్యం గింజలు లేవు, డబ్బు కూడా లేదు.

అప్పటికే ఆమె జీవితంలో ఎవ్వరు లేరు.పిలిస్తే పలికే వ్యక్తులు కూడా లేరు.

కాసిన్ని మంచి నీళ్లు తాగి అలాగే పడుకుంది.విగత జీవి గా మంచి పడిపోయింది.

అలంటివి ఆమె జీవితంలో చాల కష్టాలు చూసింది.హిట్లర్ సినిమా సంఘటన గురించి మనం తెలుసుకోవాల్సిందే.

ఆరోజు షూటింగ్లో అందరికీ రెమినరేషన్స్ వారి వారి వంతుల వారిగా ఇచ్చేశారు.ఆమె తీసుకున్న రెమినరేషన్ తో ఆ నెలకి అద్దె, ఖర్చులకు, సరుకులకి సరిపడా డబ్బు వచ్చింది.

ఆమెకు ఆ డబ్బు చాలా అవసరం.అయినా కూడా ఆ డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళగానే ఎవరో వచ్చి తమ కష్టం చెప్పుకొని డబ్బులు అడగ్గానే ఆమె చేతిలో ఉన్న డబ్బుంతా కూడా ఇచ్చి పంపిచేసింది.

మొదటి నుంచి ఆమెకు ఎన్ని అవసరాలను ఉన్నా కూడా పక్కవారికే దానం చేయడం అలవాటయింది.

ఆమె జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉండి ఉంటాయి.అడిగిన వారికి లేదనకుండా తన దగ్గర ఉన్న డబ్బు అంతా దానం చేసింది.

మొదట నుంచి అలాంటి దాన గుణం లేకపోతే కల్పనా రాయ్ చనిపోయే వరకు ఎంతో ఆస్తి ఉండేది.

అంతుచిక్కని విగ్రహ రహస్యం.. వేంకటేశ్వరస్వామి అభిషేకం ఓ వింత.. ఎక్కడంటే?