ఏఎన్నార్ సినిమా షూటింగ్ లో ఆ హీరోయిన్ డూప్ కి పెను ప్రమాదానికి కారణమేంటో తెలుసా?

సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తరుచూ పలు ప్రమాదాలు జరుగుతుంటాయి.అందులో పలువురు హీరోలు గాయపడినట్లు మనం వింటూనే ఉంటాం.

టాలీవుడ్ అనే కాదు.అన్ని సినిమా పరిశ్రమల్లో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

పలు మార్లు జరిగిన ఈ ప్రమాదాల్లో పలువురు టెక్నిషియన్లు చనిపోయినట్లు చూశాం.అయితే.

ఇప్పుడే కాదు.తెలుగు సినిమా పరిశ్రమలో గతంలోనూ ప్రమాదాలు జరిగాయి.

తెలుగులో అక్కినేని నటించిన అమాయకురాలు సినిమా సందర్భంగా కూడా ఓ అనుకోని ప్రమాదం జరిగింది.

మధుసూదన్ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శారద కీ రోల్ ప్లే చేసింది.

అక్కినేని మరదలిగా యాక్ట్ చేసింది.హీరోయిన్ గా కాంచన చేసింది.

ఈ సినిమా షూటింగ్ సందర్భంగా పెను ప్రమాదం జరిగింది.సినిమా స్టోరీ ప్రకారం.

విలన్ రమణమూర్తి రెండో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు.అనుకున్నట్లుగానే భార్య శారదకు మాయమాటలు చెప్పి.

పిక్నిక్ కు తీసుకెళ్తాడు.అక్కడ నీళ్లలోకి తోసేశాడు.

ఆమె కొన ఊపిరిలో ఉంటూ తన కూతురును అక్కినేని చేతిలో పెట్టి చనిపోతుంది.

ఈ సీన్లను కేరళ త్రివేండం దగ్గరున్న అరువికెరా డ్యామ్ దగ్గర షూట్ చేయాలనుకున్నారు.

ఆ డ్యామ్ దగ్గర ప్రవాహం ఎక్కువగా ఉంది.ఈత కొట్టడానికి కూడా వీలు లేనంతగా రాళ్లు రప్పలు ఉన్నాయి.

శారదకు ఈత రాకపోవడంతతో ఆమెకు బదులుగా డూప్ పెట్టారు.ఆమమె ఓ మలయాళీ అమ్మాయి.

ఆమె నడముకు ఓ తాడుకట్టి నీళ్లలోకి వదిలేశారు.ఇద్దరు సెట్ బాయ్స్ ఆ తాడును పట్టుకున్నారు.

"""/"/ డైరెక్టర్ యాక్ష‌న్ చెప్పగానే డ్యామ్‌ ఆరు లాక‌ర్స్ తెరుచుకున్నాయి.శార‌ద డూప్ నీళ్ల‌లోకి దూకింది.

తాడును ప‌ట్టుకున్న కుర్రాళ్లు కెమెరా వ్యూలోకి వ‌స్తున్నార‌ని డైరెక్ట‌ర్ గ‌ట్టిగా అరిచారు.కంగారుడి వారు తాడును వ‌దిలేశారు.

భారీ ప్రవాహమంలో ఆ అమ్మాయి కొట్టుకు పోతుంది.మూవీ యూనిట్ అంతా ఆందోళన పడింది.

అసిస్టెంట్ డైరెక్టర్ నీళ్లలోకి దూకి ఆమెను పట్టుకోవాలనుకున్నాడు.కానీ తనూ కొట్టుకుపోయాడు.

కొంచెం దూరంలో సుడిగుండాలున్నాయి.దాదాపు 200 గజాల దూరం ఇద్దరు కొట్టుకుపోయారు.

వెంటనే స్థానికులు ప్రవాహంలోకి దూకి వారిని కాపాడారు.మొత్తానికి పెద్ద గండం నుంచి సినిమా యూనిట్ తప్పించుకుంది.

దోతీ కట్టుకోవడం నచ్చక సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు