బాలయ్య చిరంజీవి ఎపిసోడ్ గురించి రైటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్... ఏం చెప్పారంటే?

నందమూరి నట సింహం బాలకృష్ణ మొదటిసారిగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ప్రముఖ తెలుగు ఓటిటీ సంస్థ ఆహా లో ప్రసారమైన ఈ షో బాగా పాపులర్ అయ్యింది.

అంతేకాకుండా ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ తో సంచలనం సృష్టించింది.బాలయ్య ఈ షోకీ హోస్ట్ గా వ్యవహరిస్తూ తనలో ఉన్న మరొక టాలెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు.

ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరించారు బాలయ్య బాబు.ఈ షోలో తనదైన మ్యానరిజం, డైలాగ్స్, లుక్స్, సెన్సాఫ్ హ్యూమర్ తో అలరించారు.

ఇటీవలే మొదటి సీజన్ ముగిసిన విషయం తెలిసిందే.రెండవ సీజన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు షో నిర్వాహకులు.

ఇక రెండవ సీజన్ ను కూడా మరొక లెవెల్ లో ప్లాన్ చేస్తోందట ఆహా టీం.

ఇదిలా ఉంటే తాజాగా ఈ షోకీ రైటర్ గా వ్యవహరించిన బీబీఎస్ రవి ఇటీవల ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ షోలో ఇప్పటివరకూ అందరి హీరోలు సందడి చేసిన విషయం తెలిసిందే.కానీ ఈ షో లో మెగా హీరోల సందడి మాత్రం కరువైంది.

అయితే రైటర్ బి బి ఎస్ రవి తెలిపిన ప్రకారం అన్ స్టాపబుల్ షో కి చిరంజీవితో కూడా ఒక ఎపిసోడ్ ను ప్లాన్ చేసినట్లు తెలిపాడు.

"""/"/ అయితే అప్పుడు బాలకృష్ణ భుజానికి శస్త్రచికిత్స చేయించుకొని ఉండటం వల్ల, ఒకవైపు చిరంజీవి తన సినిమాలతో బిజీగా ఉండటం వల్ల చిరంజీవి డేట్స్ దొరకడం కష్టమైపోయింది అని అందువల్ల మెగా ఎపిసోడ్ ఆలోచనను విరమించుకున్నామని తెలిపారు.

మరి రెండవ సీజన్ లో అయినా చిరంజీవి తో ఎపిసోడ్ ఉంటుందో ఉండదో చూడాలి మరి.

ఇక రెండవ సీజన్ ఎప్పుడు ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మొదటి సీజన్ కు మోహన్ బాబు, మహేష్ బాబు, అల్లు అర్జున్, రాజమౌళి, విజయ్ దేవరకొండ, నాని లాంటి సెలబ్రెటీలు వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే.

గ్రహశకలాన్ని గుర్తించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి