అన్ స్టాపబుల్ 2 ..ఎన్టీఆర్ కు నో చెప్పిన బాలయ్య... ఇందులో నిజమెంత?

నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఆహా వేదికగా ప్రసారమవుతున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన మొదటి సీజన్ ఎంతో విజయవంతం కాగా త్వరలోనే రెండవ సీజన్ ప్రారంభం చేయడానికి నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇకపోతే నేడు విజయవాడలో ఈ టాక్ షో ట్రైలర్ కార్యక్రమాన్ని విడుదల చేయనున్నారు.ఇక ఈ కార్యక్రమం త్వరలోనే ప్రారంభమవుతుందని తెలియగానే ఈ కార్యక్రమానికి అతిథులుగా నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ హాజరు కాబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా నందమూరి యంగ్ హీరోలు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి అయితే ఈ విషయం తెలిసినటువంటి నందమూరి అభిమానులు ఇలా ఒకే వేదికపై నందమూరి హీరోలను చూడబోతున్నారని తెలియగానే సంతోషం వ్యక్తం చేశారు.

< -->తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విషయంలో ఎన్టీఆర్ స్పందించిన తీరు పట్ల సొంత ఫ్యామిలీ మెంబర్స్ తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని ఈ క్రమంలోనే బాలకృష్ణ ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ రావడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

ఇలా ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ఇష్టపడనటువంటి బాలయ్య నిర్వాహకులకు కూడా తనని ఆహ్వానించవద్దని చెప్పారని వార్తలు వస్తున్నాయి.ఇలా ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి దూరం కావడంతో కళ్యాణ్ రామ్ పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా హాజరవుతున్నారని తెలుస్తోంది.

అయితే ఈ విషయంపై మరికొందరు స్పందిస్తూ ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరు కాబోతున్నారని పలువురు హీరోల పేర్లు వినబడుతున్నాయి.అయితే ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేస్తున్నారు.

క్లిక్ పూర్తిగా చదవండి

ఆ ప్రముఖ టీడీపీ నేత జీవితం ఆధారంగా వీరసింహారెడ్డి తెరకెక్కిందా?

మీ వ్యాపారం కోసం ఎటువంటి పేరు ఎన్నుకుంటే హిట్ అవుతుందంటే…

నెల్లూరు జిల్లా వైసీపీలో పొలిటికల్ హీట్

చిరంజీవి గారు దయచేసి మాకోసం ఆ ఒక్క సినిమా తీయండి !

ఒక వైపు వాయిదా అంటూనే మరో వైపు పాటల విడుదల ఎందుకు భయ్యా?

దమ్ముంటే రండి..! మంత్రులకు ఈటెల సవాల్