కనిపించని ఆగ్రహం.. కురిపించిన సెంటిమెంట్ ! జగన్ మారిపోయారు
TeluguStop.com
వైసిపి అధినేత , ఏపీ సీఎం జగన్( CM Jagan ) ఎప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు నియోజకవర్గ ఇన్చార్జిల్ తో సమావేశం నిర్వహించినా.
వారి పనితీరును ప్రస్తావిస్తూ తీవ్ర ఆగ్రహం ప్రదర్శించడంతో పాటు, పనితీరు సక్రమంగా లేని వారి పేర్లను బహిరంగంగా వినిపించి వారికి వార్నింగ్ ఇస్తూ ఉంటారు.
ఇది ఎప్పటి నుంచో సర్వసాధారణంగా చోటు చేసుకుంటూనే ఉంది.అయితే నిన్న నిర్వహించిన పార్టీ కీలక సమావేశంలో జగన్ తీరు గతం కంటే భిన్నంగా ఉంది.
ఎక్కడా ఆగ్రహం ప్రదర్శించకుండా.అందరిని సెంటిమెంటుతో కట్టి పడేసే విధంగా జగన్ ప్రయత్నించారు.
ఏ ఒక్క ఎమ్మెల్యేను వదులుకోమని అందరినీ గెలిపించుకుంటామని జగన్ మాట్లాడారు.మళ్లీ వైసీపీ ప్రభుత్వం( YCP Govt ) ఏర్పడే విధంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో వ్యవహరించాలని, సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుని పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రభుత్వం ప్రజల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలు( Welfare Schemes ) వల్ల వారికి ఎంత మేర లబ్ధి చేకూరింది అనే విషయాన్ని వివరంగా ప్రజలకు తెలియజేయాలని జగన్ సూచించారు.
"""/" /
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని చెప్పారు.
నెలకు 25 రోజులు సచివాలయాల్లో తిరగాలని , సెప్టెంబర్ నుంచి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని కోరారు.
ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోనని, అందరితో పని చేయించి గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తానని, ఎవరు చేయాల్సిన పని వాళ్లు చేస్తే 175 సీట్లు గెలుస్తామంటూ జగన్ ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
అయితే గతం కంటే భిన్నంగా జగన్ ప్రసంగం కనిపించడం, ఎప్పుడూ హెచ్చరికలతో భయపెట్టే విధంగా మాట్లాడే జగన్ ఈసారి మాత్రం సున్నితంగా మాట్లాడడం ఇవన్నీ ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశం గా మారాయి.
"""/" /
దినంతటికీ కారణం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడడం, వైసిపి అసంతృప్త ఎమ్మెల్యేలను టిడిపి దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండడం, ఇవన్నీ లెక్కలు వేసుకున్న జగన్ తన వైఖరి మార్చుకున్నట్లుగా అర్థమవుతుంది.
ఇప్పటికే ఉండవల్లి శ్రీదేవి , మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి , ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వారు పార్టీకి దూరమయ్యారు.
వారి కారణంగా పార్టీకి డ్యామేజ్ జరిగింది.ఇప్పుడు పనితీరు సక్రమంగా లేదంటూ మరికొంతమంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినా, అది టిడిపి తనకు అనుకూలంగా మార్చుకుంటుందనే ఉద్దేశంతో జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు నచ్చ చెప్పే విధంగా మాట్లాడినట్లుగా అర్థమవుతుంది.
కరివేపాకు గాళ్లు మీకే అంతుంటే బన్నీకి బలుపు ఉండడం తప్పులేదు: మాధవీ లత