జిల్లాలో హోమ్ ఓటింగ్ కి అనూహ్య స్పందన

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో( Rajanna Sirisilla District ) హోం ఓటింగ్ మంగళవారం నుండి శనివారం వరకు 6 రోజుల పాటు అధికారులు హోం ఓటింగ్ కు అవకాశం కల్పించారు.

ఎనభై ఏళ్లకు పైబడిన వృద్ధులు, 40 శాతం కు పైబడి వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.

జిల్లాలో హోమ్ ఓటింగ్ పై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక దృష్టి పెట్టారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోనీ వేములవాడ , సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో హోమ్ ఓటింగ్ కు దరఖాస్తు చేసుకున్న మొత్తం 1028 మందికి గానూ 944 మంది ( 92 శాతం) ఇంటి వద్ద నుంచి ఓటు సద్వినియోగం చేసుకున్నారు.

హోమ్ ఓటింగ్ కోసం సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో 5, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం( Vemulawada Assembly Constituency )లో 9 బృందాలను ఏర్పాటు చేసి కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు బృందాలు ఇంటింటికీ వెళ్లి హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు.

ఇంటి వద్ద సాధారణ పోలింగ్ కేంద్రం మాదిరి ఏర్పాటు చేసి హోమ్ ఓటింగ్ కు అవకాశం కల్పించారు.

ఇంటి వద్దకే వచ్చి ఓటు హక్కు కల్పించడం పట్ల వయోవృద్ధులు, వికలాంగులు సంతోషం వ్యక్తం చేశారు.

భారీ అంచనాలతో వచ్చిన రాయన్ ప్లాప్ అయింది.. మరి ధనుష్ పరిస్థితి ఏంటి..?