దర్శకుడు బాల .. అబ్బో.. ఒక సినిమా అంటే ఎందరిని పీకేయ్యాలో తెలుసా ?
TeluguStop.com
దర్శకుడు బాల.తమిళ సినిమాల్లో దర్శకుడిగా ఇతడికి మంచి క్రేజ్ ఉంది.
తాను అనుకున్నట్టుగా సినిమా తీయడం కోసం ఏదైనా చేస్తాడు.ఎవరినైనా పీకేస్తాడు.
హీరోలను మార్చడం, హీరోయిన్స్ ని ఎంచుకోవడం లో ఇబ్బంది పడటం అనేది ప్రతి సినిమాకు జరుగుతుంది.
ఇక అయన క్రియేటివ్ ఫ్రీడమ్ కోసం ప్రాణం అయినా పెడతాడు.చివరికి ఒక్కో సినిమా ముగిస్తే లోపు ఆ సినిమా నుంచి ఎంత మంది ఎగ్జిట్ అవుతారో ఆయనకు కూడా తెలియదు.
చాల సార్లు అయన నిర్మాతలను మార్చుకున్న రోజులు కూడా ఉన్నాయ్.సినిమా కోసం మాత్రమే పుట్టినట్టుగా అయన జీవితం కొనసాగుతుంది.
సాధారణంగా రెండేళ్లకు ఒక సినిమా తీస్తాడు బాల.కానీ హీరోలను, హీరోయిన్స్ ని, నిర్మాతలను మార్చుతూ నేనే దేవుణ్ణి సినిమా ఏకంగా ఐదేళ్లు తీసాడు.
ఇక అతడి ఇమాజినేషన్ లో ఏది ఉంటె అది చేయాల్సిందే.దాని కోసం ఎంత కష్టం అయినా పడతాడు.
చివరికి ఆయన్ను ఒక వర్గం హీరోలు మాత్రమే ఇష్టపడుతుండటం విశేషం.అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన హీరోలు విక్రమ్ , సూర్య, అధర్వ, ఆర్య .
ఇలాంటి హీరోలు మాత్రమే అతడితో మళ్లి కలిసి పని చేయడానికి ఇష్టపడతారు.చాల మంది అతడితో ఒక్క సినిమా లో అయినా నటించాలనుకుంటారు కానీ మరో సినిమా తో ముందుకు రావాలంటే బయటపడతారు.
"""/"/
ఇక సూర్య బాల తో పితాగామన్(శివ పుత్రుడు), నందా, మాయావి వంటి సినిమాల్లో నటించి తన క్రేజ్ ని పెంచుకున్నాడు.
ఇక విక్రమ్ బాల మొదటి సినిమా హీరో.బాల తీసిన మొదటి సినిమా సేతులో విక్రమ్ హీరోగా నటించాడు.
అతడి కొడుకు ధృవ్ సైతం బాల దర్శకత్వం లో పరిచయం అయ్యాడు.ఇక అధర్వన్ హీరో గా నిలబడటానికి కారణం అయినా రెండు సినిమాలు బాల తీసినవే.
అవి పరదేశి, చండి వీరన్.ఇందులో పరదేశి చాల పెద్ద హిట్టు.
ఇక ఆర్యన్ హీరో గా బాల దర్శకత్వం లో నాన్ కాదవుల్, అవన్ ఇవన్ వంటి సినిమాలు వచ్చాయి.
కానీ 23 ఏళ్ళ కెరీర్ లో కేవలం 13 సినిమాలు మాత్రమే తీసిన బాల చాల వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటాడు.
వీడియో వీడియో: కింగ్ కోబ్రా పుట్టుకను చూసారా ఎప్పుడైనా?