లిరిక్ రైటర్ చంద్రబోస్ భార్య గురించి ఎవరికి తెలియని విషయాలు

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు కలిసి నటిస్తారు కాబట్టి వారి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటారు అలా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు అలా కాకుండా తెరవెనక పని చేసే వారు కూడా కొందరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు వాళ్లలో పాటల రచయిత ఆయన చంద్రబోస్ అలాగే సినిమాలో సాంగ్స్ కొరియోగ్రఫీ చేసే కొరియోగ్రాఫర్ అయిన సుచిత్ర ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

చంద్రబోస్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన తన సినిమాల్లో పాటలు రాసి చాలా అవార్డులు కూడా గెలుచుకున్నాడు.

చంద్ర బోస్ గారు వరంగల్ లో జన్మించారు ఆయన అసలు పేరు కూకుట్ల సుభాష్.

చదువు ముగించుకుని హైదరాబాద్ కి వచ్చి మొదటగా దూరదర్శన్ లో సింగర్ గా ప్రయత్నం చేశారు అది వర్కౌట్ కాకపోవడంతో సాంగ్స్ రాస్తూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు.

అయితే తన ఫ్రెండ్ కి డైరెక్టర్ ముప్పలనేని శివ రిలేషన్ అని తెలుసుకోవడం ఆయనతో వెళ్లి వారిని కలిశారు అప్పుడు డాక్టర్ డి.

రామానాయుడు ప్రొడ్యూస్ చేస్తున్న తాజ్ మహల్ సినిమాకి డైరెక్టర్ గా చేస్తున్నాడు ముప్పలనేని శివ.

చంద్ర బోస్ వెళ్లి ముప్పలనేని శివ గారిని కలిసి మాట్లాడడంతో తాజ్ మహల్ సినిమా లో మంచుకొండల్లోన ముత్యమా అనే సాంగ్ రాసే అవకాశాన్ని కల్పించారు ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది అలాగే సినిమా కూడా మంచి హిట్ అవడంతో తర్వాత చంద్రబోస్ గారు వెనక్కి తిరిగి చూడకుండా చాలా సినిమాలకు సాంగ్స్ రాస్తూ వచ్చారు.

"""/"/ పెళ్లి సందడి, చూడాలని ఉంది సినిమాలకి సాంగ్స్ రాస్తూ లిరిసిస్ట్ గా తెలుగులో మంచి గుర్తింపును సాధించారు.

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వి.వి.

వినాయక్ దర్శకుడిగా వచ్చిన ఆది సినిమాలో నీ నవ్వుల తెల్లదనాన్ని అనే పాటకు చంద్రబోస్ గారికి నంది అవార్డు వచ్చింది.

అలాగే రామ్ చరణ్ హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీర సినిమా లో పంచదార బొమ్మ బొమ్మ అనే సాంగ్ కూడా రాశారు ఈ పాటకి చంద్ర బోస్ గారికి మంచి గుర్తింపు లభించింది మొదటగా ఈ పాట లో పల్లవి వేరేగా రాశారు ఆ తర్వాత తనకే నచ్చక పంచదార బొమ్మ అంటూ రాశాను అని చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పారు రాఘవేంద్రరావు, కీరవాణి లాంటివారు చంద్రబోస్ ని వేటూరి సుందరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి తర్వాత స్థానంలో చంద్రబోస్ గారు ఉంటారని ఎప్పుడూ చెబుతూ ఉంటారు.

ఇదిలా ఉంటే రాఘవేంద్ర రావు గారు తీసిన ఆఖరిపోరాటం సినిమాతో కొరియోగ్రాఫర్ గా మారిన సుచిత్ర గారిని చంద్రబోస్ గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

"""/"/ ఆఖరి పోరాటం సినిమా తర్వాత ఆవిడ చైతన్య,మనీ,గాండీవం, వినోదం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి చాలా సినిమాలకి కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు.

అలాగే కొరియోగ్రాఫర్ గా కూడా ఆమె చాలా అవార్డ్స్ అందుకున్నారు.రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో బ్రహ్మానందం కొడుకు గౌతమ్ హీరోగా పరిచయం చేస్తూ రతి ఆర్ముగం హీరోయిన్ గా పరిచయం అవుతూ చేసిన పల్లకిలో పెళ్లికూతురు సినిమాకి సుచిత్ర గారే దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం సుచిత్రా సినిమాలలో కొరియోగ్రఫీ చేస్తూ బిజీగా అలాగే చంద్ర బోస్ గారు తన పాటలతో అందరినీ అలరిస్తూ తనకంటూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సాధించుకుంటూ డైరెక్టర్ల అందరితో కలివిడిగా ఉంటూ ఎవరితో ఏ వివాదం పెట్టుకోకుండా ఒక పాట డైరెక్టర్ కి నచ్చే అంతవరకు ఎన్ని వర్షన్స్ కావాలంటే అన్ని వర్షన్స్ రాస్తూ వస్తున్నారు.

మొత్తానికి సుచిత్రా చంద్రబోస్ గారు ఇద్దరు మంచి ఫ్యామిలీ లైఫ్ నీ లీడ్ చేస్తూ సినిమాల్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ ని సినిమా లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ మంచి గుర్తింపును సాధిస్తున్నారు.

కుక్క కోసం వెరైటీ సూట్‌కేసు కొన్న ఎన్నారై.. దీని ధర ఎన్ని లక్షలో తెలిస్తే..!