శింబు 27 కేజీల బరువు తగ్గడం వెనుకున్న కష్టం ఎంతో తెలుసా?

శింబు.కోలీవుడ్ యాక్టర్.

ఒకప్పుడు ఈయన నిత్యం ఏదో ఒక వివాదంలో తలదూర్చే వాడు.గొడవలకు కేరాఫ్ గా ఉండేవాడు.

అయితే గడిచిన కొంత కాలంగా ఎలాంటి వివాదాల జోలికిపోవడం లేదు.ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉంటున్నాడు.

ప్రేమలకు, డేటింగులకు అవకాశం ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటున్నాడు.అటు హీరోగా మాత్రం బిజీగానే ఉంటున్నాడు.

వచ్చే ఏడాది ఈయనకు సంబంధించిన మూడు సినిమాలు జనాల ముందుకు రాబోతున్నాయి.సమీప భవిష్యత్తులో లూప్ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సందర్భంగా ప్రమోషన్ లో బిజీ అయ్యాడు.అయితే ఈ సినిమా కోసం తాను ఎంత కష్టపడ్డాడో వివరించాడు.

లూప్ సినిమా కోసం తాను మూడు సంవత్సరాలుగా కష్టపడుతున్నట్లు చెప్పాడు.ఒకానొక సమయంలో మానసిక ఒత్తిడికి గురైనట్లు వెల్లడించాడు.

దాని మూలంగా బరువు బాగా పెరిగినట్లు చెప్పాడు.అయితే ఆ ఒత్తిడి నుంచి బయట పడేందుకు బాగా ప్రయత్నించినట్లు వెల్లడించాడు.

అందులో భాగంగానే స్ట్రిక్ట్ డైట్ మెయిన్ టెయిన్ చేసినట్లు చెప్పాడు.తనకు ఇష్టమైన మాంసాహారాన్ని మానేసినట్లు వెల్లడించాడు.

ఆ తర్వాత మద్యానికి దూరం అయినట్లు వెల్లడించాడు.ఈ రెండింటి మూలంగా తనలో చాలా మార్పులు వచ్చినట్లు చెప్పాడు.

దీంతో పాటు జిమ్ లో బాగా గడిపినట్లు వెల్లడించాడు.అలా సుమారు 27 కిలోల బరువు తగ్గినట్లు చెప్పాడు.

"""/"/ ఒక మనిషి ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా 27 కిలోల బరువు తగ్గడం మామూలు విషయం కాదని చెప్పాడు.

అందుకోసం ఎంతో కమిట్ మెంట్ తో వర్కౌట్ చేసినట్లు చెప్పాడు.తన శ్రద్ధ మూలంగా ఈ బరువు తగ్గడం సాధ్యమైందన్నాడు.

ప్రస్తుతం శింబు చాలా స్లిమ్ గా కనిపిస్తున్నాడు.తాజాగా ఆయన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

అటు శింబు కొత్త ఫోటోలు, పాత ఫోటోలు పక్కపక్కన పెట్టి బాగా వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.

అటు శింబు హీరోగా కరోనా కుమార్ అనే మరో సినిమా కూడా రెడీ అవుతుంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

పుష్ప ది రూల్ రీలోడెడ్ లో యాడ్ చేసిన సీన్స్ ఇవే.. ఓటీటీలో సైతం ఉంటాయా?