తక్కువ ధరకే బంగారు నాణాలు ఇస్తామంటూ పాతిక లక్షలతో జంప్ …
TeluguStop.com
ప్రస్తుతం పోలీసులు, ప్రభుత్వ అధికారులు మనుషులు చేసేటువంటి మోసాలపై నిఘా ఉంచినప్పటికీ కొందరు కేటు గాళ్లు మాత్రం కొత్త కొత్త దారులు వెతుక్కుంటూనే ఉన్నారు.
తాజాగా కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు బంగారు నాణాలను అతి తక్కువ ధరకే విక్రయిస్తామని ఓ వ్యక్తి నుంచి దాదాపుగా 25 లక్షల రూపాయలు కాజేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకి సమీపంలో ఉన్నటువంటి బళ్లారికి చెందిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బంగారు నాణాలను విక్రయిస్తామని కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుని అనంతపురం జిల్లాకి రప్పించారు.
అనంతరం నకిలీ బంగారు నాణాలను అప్పజెప్పి దాదాపుగా 25 లక్షల రూపాయలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
అయితే ఈ బంగారు నాణేలను దగ్గరలో ఉన్నటువంటి కంసాలి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి చూపించగా బంగారు నాణాలు నకిలీ అని తేల్చారు.
అతి తక్కువ ధరకే బంగారం దొరికిందంటూ సంబరపడుతూ ఇంటికి వచ్చినటువంటి ఆ వ్యక్తికి చివరికి నిరాశే మిగిలింది.
దీంతో బాధితుడు లబోదిబోమంటూ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగినదంతా వివరించి క్రికెట్ వాళ్ల నుంచి తన డబ్బులు తనకు ఇప్పించాలని కోరాడు.
ఈ విషయంపై స్పందించిన పోలీసులు అనవసరంగా అత్యాశలకు పోయి గుర్తు తెలియని వ్యక్తుల మాటలను నమ్మి డబ్బులు గానీ మరే ఇతర వస్తువులను గానీ ఇవ్వొద్దంటూ సూచిస్తున్నారు.
అంతేకాక ఎవరైనా సరే కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులు తారస పడితే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
మొటిమలకు గుడ్ బై చెప్పాలనుకుంటే ఈ రెమెడీని ఫాలో అవ్వండి!