గుర్రం మీది నుంచి పడ్డా దెబ్బలు తగలకుండా తప్పించుకున్న శాంతిప్రియ..
TeluguStop.com
శాంతిప్రియ.భానుప్రియ చెల్లిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.
వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో చక్కటి సినిమాలు చేసింది.
కొంత కాలం తర్వాత బాలీవుడ్ లోనూ అడుగు పెట్టింది.అక్కడ కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.
అదే సమయంలో వివాహం చేసుకుంది.అనంతరం సినిమాలకు దూరం అయ్యింది.
పెళ్లైన కొంత కాలానికే ఆమె భర్త ఓ ప్రమాదంలో చనిపోయాడు.దీంతో ఇద్దరు కొడుకులను పెంచి పెద్ద చేసింది.
ప్రస్తుతం ఈ అందాల తార సినిమా రంగంలో మళ్లీ సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది.
శాంతిప్రియ సినిమా కెరీర్ ప్రారంభంలో రఘవరన్ సరసన నటించింది.పెరియవర్‌గళే తాయ్ మార్గళే అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా చేసింది.
ఈ సినిమాకు సంబంధిచిన షూటింగ్ మద్రాస్ వైఎంసీఏలో జరిగింది.అందులో శాంతిత గుర్రపు స్వారీ చేసే సీన్ ఒకటి ఉంటుంది.
ఈ సీన్ షూటింగ్ కోసం ఆమెకు డూప్ పెట్టాలని దర్శక నిర్మాతలు భావించారు.
అయితే అందుకు తను ఒప్పుకోలేదు.ఎందకంటే తనకు అప్పటికే గుర్రపు స్వారీలో మంచి అనుభవం ఉంది.
అందుకే డూప్ సాయం లేకుండా తానే ఆ సీన్ చేస్తానని చెప్పింది.చివరకు తన పట్టుదల కారణంగా దర్శక నిర్మాతలు ఏం చెప్పలేకపోయారు.
గుర్రాన్ని తెప్పించారు.స్టైల్ గా గుర్రం ఎక్కి కళ్లెం పట్టుకుంది.
గుర్రపు స్వారిలో తన సత్తాను చూపించాలని కళ్లాన్ని గుంజింది.గుర్రం స్పీడుగా పరిగెత్తింది.
"""/"/
కొంత దూరం వెళ్లాక గుర్రం జంప్ చేసింది.దీంతో ఆమె కాళ్లు రికాబు నుంచి జారాయి.
పైకి ఎగిరింది.బ్యాలెన్స్ ఆపలేకపోయింది.
అదే సమయంలో చేతిలో కళ్లెం జారిపోయింది.గుర్రం ముందుకు స్పీడుగా పరిగెత్తింది.
దీంతో శాంతి ప్రియ అమాంతం గుర్రం మీద నుంచి కిందపడింది.వెంటనే యూనిట్ అంతా ఆమె దగ్గరకు చేరుకుంది.
అప్పటికే తను నేల మీది నుంచి లేచి నిలబడింది.గుర్రం మీది నుంచి పడ్డా తనకు ఒక్క దెబ్బ కూడా తగల్లేదు.
ఎప్పుడైతే కాలు పట్టుతప్పిందో అప్పుడే తను కింద పడతానని ఊహించి.జాగ్రత్తగా గుర్రం మీది నుంచి దెబ్బలు తగలకుండా కిందకు జారింది.
ఆమె తెలివికి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
మెగా హీరోలతో మంచు మనోజ్ సంక్రాంతి వేడుకలు… ఫోటోలు వైరల్!