సినీ ఫక్కీలో శరత్ కుమార్ దొంగ ను పట్టిస్తే .. చివరికి ఏం జరిగిందో తెలుసా.. ?
TeluguStop.com
శరత్ కుమార్.దక్షిణాదిలో పరిచయం అక్కర్లేని నటుడు.
తమిళనాట పుట్టి పెరిగినా.ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి ఇక్కడి జనాల మదిలో నిలిచిపోయాడు.
ప్రముఖ నటి రాధికను వివాహం చేసుకున్న శరత్ కుమార్ ప్రస్తుతం సంతోషకర జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.
శరత్ కుమార్ కు సినిమాల్లో స్టంట్లు చేయడం అంటే చాలా ఇష్టం.లాంటి డూప్ లు లేకుండానే నటించేవాడు.
సినిమాలోకి రాకముందు నుంచే తనకు స్టంట్లు చేసే అలవాటు ఉండేది.ఆ అలవాటే ఆయనపై అరెస్టు వారెంటు జారీ అయ్యేలా చేసింది.
ఇంతకీ ఆయన ఏం చేశాడు? ఎందుకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శరత్ కుమార్ మద్రాస్ న్యూ కాలేజీలో బిఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.ఓ సండే రోజు అడయార్ ఇందిరా నగర్ లో తన ఇంటి చుట్టూ ఉన్న మిత్రులతో కలిసి వెస్ట్రన్ మ్యూజిక్ వింటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు.
ఆ సమయంలో బయట నుంచి ఓ అమ్మాయి అరుపు వినిపించింది.ఒక్కసారిగా శరత్ కుమార్ మిత్రులంతా బయటకు వచ్చారు.
అక్కడో దొంగ అమ్మాయి మెడలో చైన్ లాక్కుని సైకిల్ మీద పారిపోతున్నాడు.మిగతా వాళ్లు ఏం జరిగిందని ఆరా తీస్తుంటే శరత్ కుమార్ మాత్రం అక్కడే ఉన్న స్కూటర్ తీసుకుని.
ఆ దొంగను వెంటపడి పట్టుకున్నాడు.ఆమెకు గొలుసు ఇప్పించి.
పక్కనే ఉన్న పోలీసులకు ఆ దొంగను అప్పగించాడు.అప్పట్లో ఏసీపీగా ఉన్న భట్.
శరత్ కుమార్ ధైర్యసాహసాలకు మెచ్చుకున్నాడు.ఈ కేసుకు సంబంధించి సాక్ష్యం చెప్పడానికి ఓకే నా? అని అడిగాడు భట్.
ఓకే అని ఓ పేపర్ మీద సంతకం పెట్టాడు. """/"/
ఓ ఆరు నెలల తర్వాత.
తను బెంగళూరులోని ఓ డైలీ పేపర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు.ఓ రోజు వాళ్లింటికి ఓ సమాచారం వచ్చింది.
నీపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.వెంటనే రావాలని పోలీసుల నుంచి పిలుపు వచ్చింది.
శరత్ కుమార్ కు ఏం అర్థం కాలేదు.ఏ గొడవల్లో తలదూర్చని తనపై అరెస్ట్ వారెంట్ ఏంటని ఆశ్చర్యపోయాడు? వెంటనే మద్రాసుకు వచ్చాడు.
ఇంటికి వచ్చాక అసలు విషయం తెలిసింది.గతంలో తను పట్టుకునున్న దొంగ కేసు విచారణకు వచ్చింది.
ఆయన ఊళ్లో లేకపోవడంతో కోర్టుకు హాజరు కాలేదు.దీంతో శరత్ కుమార్ పై వారెంట్ వచ్చింది.
మళ్లీ లాయర్ ను కలిసి కోర్టులో సాక్ష్యం చెప్పడంతో దొంగకు శిక్ష పడింది.
తీరు మార్చని టీమిండియా బ్యాటర్స్.. 150 పరుగులకే ఆలౌట్