సినిమా సూపర్ డూపర్ హిట్..కానీ సినిమా తీసి తప్పు చేసానని ఏడ్చిన దర్శకుడు
TeluguStop.com
సినిమా పుట్టిన దగ్గర నుండి ఇప్పటివరకు ఎన్నో ప్రేమ సినిమాలు వచ్చాయి.పోయాయి! అయితే అచ్చమైన ప్రేమకు అర్ధం పట్టిన ప్రేమ సినిమా మాత్రం మరో చరిత్ర అని చెప్పొచ్చు.
ఈ సినిమా 1975 రిలీజ్ అయినా ఇప్పటికి ఈ సినిమా స్టోరీ, బాలచంద్రగారి దర్శకత్వం, విశ్వనాథన్ గారి సంగీతం, కమల్ హస్సన్, సరిత, మాధవిల నటన ఇలా మరో చరిత్ర సినిమా అల్ టైం తెలుగు తమిళ భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయి చరిత్ర సృష్టించింది.
అయితే ఆ చరిత్ర వెనక ఉన్న ఆసక్తిరకర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఈ మరో చరిత్ర సినిమాని నిర్మించింది ఆండాళ్ ప్రొడక్షన్స్ సంస్థ.
ఈ సంస్థ మొదటి సినిమా వచ్చేసి అంతులేని కథ.ఈ సినిమాని కూడా బాలచంద్ర గారే దర్శకత్వం వహించడం వలన సూపర్ డూపర్ హిట్ అయింది.
దాంతో ఈ బ్యానేర్ లోనే ఇంకొక సినిమా చేద్దాం అని అనుకున్నారు డైరెక్టర్ బాలచంద్ర గారు.
అయితే ఈసారి తమిళ్ రీమేక్ కాకుండా డైరెక్ట్ తెలుగు సినిమా తీయాలని అది ఒక మంచి లవ్ స్టోరీతో అందరూ మెచ్చే సినిమా తీయాలని అనుకున్నారు.
దానికి సంబంధించి ఒక మంచి కథను కూడా అనుకోన్నారు.కథకు తగ్గట్టుగానే ఈ సినిమా రచయిత గణేష్ పాత్ర మంచి రచనతో పాటు ఈ సినిమాకి టైటిల్ ని కూడా అందించారు.
మొదట గణేష్ గారు ఒక పత్రికలో రాసిన సీరియల్ పేరు "మరో ప్రేమకథ" సో, అదే పెడదాం అని అనుకున్నారు.
దానికి బాలచంద్ర గారు కూడా ఓకే అన్నారు కానీ ఆతర్వాత కొంతమంది ఈ కథ వింటుంటే ఇందులో చరిత్ర అనే పదం వస్తే బావుంటుంది అని అనడంతో మరో ప్రేమ చరిత్ర అని పెట్టారు.
అయితే ప్రేమ అని టైటిల్ ఉంటె ప్రేక్షకులకి లవ్ స్టోరీ అని తెలిసిపోయి అంత కిక్కు ఉండదనుకొని కేవలం మరో చరిత్ర అని పెట్టారు.
అలా ఆ టైటిల్ కుదిరింది. """/"/
ఇక ఆతర్వాత హీరో పేరును డైరెక్టర్ బాల చంద్ర గారిని అందరూ ప్రేమగా బాలు అని పిలుస్తారు కాబట్టి హీరో పేరు బాలు అని.
ఇక ప్రతి మగాడి జీవితంలో ఒక స్వప్న సుందరి ఉంటుంది కాబట్టి హీరోయిన్ పేరు స్వప్న అని పెట్టారు.
ఇక ఆ తర్వాత హీరోగా కమల్ హస్సన్ అని అనౌన్స్ చేసారు అయితే కమల్ అప్పుడు దాసరి గారి కన్యాకుమారి సినిమాకి డేట్స్ ఇచ్చేసాడు.
అయితే కమల్ హస్సన్ కి లైఫ్ ఇచ్చిన బాలచంద్ర గారికి నో చెప్పడం ఇష్టం లేక వెంటనే కమల్ దాసరి గారి దగ్గరకు వెళ్లి నా గురువు గారి సినిమా నేను కచ్చితంగా చేయాలి అని చెప్పడంతో దాసరి గారు గురువు మాటను జవదాటకూడదు వేళ్ళు అంటూ పర్మిషన్ ఇచ్చాడు.
దాంతో ఆ సమస్య తీరింది. """/"/
ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కావాలి.
మొదటి హీరోయిన్ గా మాధవిని ఎంపిక చేసారు.ఇక రెండో హీరోయిన్ గా జయప్రధని అడిగారు ఆమె చేయలేకపోయింది.
ఆ తర్వాత హీరోయిన్ దీపను అడిగారు కానీ ఆమె డేట్స్ కూడా కుదరలేదు దాంతో మరో 150 మంది అమ్మాయిలను స్క్రీన్ టెస్ట్ చేసిన ఎవరు సెలెక్ట్ కాలేదు.
ఇక చివరిగా సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు గారి చుట్టాలమ్మాయిని అభిలాషను చూసిన బాలచంద్రగారు ఆ పిల్లను ఓకే చేసేసారు.
అయితే అభిలాష చూడటానికి అందంగా లేకపోయినా ఆమె మాటలు, యాక్టింగ్, డాన్స్ ఇవన్నీ చూసిన బాలచంద్ర గారు ఫిదా అయిపోయి అభిలాషా అనే పేరుని సరితా అని మార్చి మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు.
"""/"/
ఇక ఈ సినిమాని బ్లాక్ అండ్ వైట్ లోనే సినిమాని తీయాలని ఫిక్స్ అయి మంచి మంచి నటీనటులను కూడా తీసుకొని.
వైజాగ్ చుట్టు ప్రక్కల ప్రాంతాలన్నీ వెతికి లొకేషన్స్ సెట్ చేసుకొని షూట్ కూడా స్టార్ట్ చేసేసారు.
షూటింగ్ లో తప్పని సరిగా సూర్యోదయం సూర్యాస్తమయం షాట్స్ తీయాలని మొత్తం టీంని ఉరుకులు పరుగులు పెట్టించేవారట సరిగ్గా నిద్ర, తిండి కూడా ఉండేది కాదట.
ఒక్కోరోజు చెడిపోయిన ఆహరం కూడా తినేవారట.అలా ఎంతో కస్టపడి సినిమాని తీశారు కాబట్టే మరో చరిత్ర.
చరిత్రలోకి ఎక్కింది.ముఖ్యంగా ఈ సినిమాలో సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.
ఈ సినిమా తెలుగు కాపీని తమిళనాడులో కూడా రిలీజ్ చేసారు.అక్కడ సఫైర్ అనే థియేటర్లో ఏకధాటిగా 556 రోజులు ఉదయం ఆటలుగా ఆడి 12 లక్షల రూపాయలను కలెక్ట్ చేసింది.
"""/"/
ఇక ఈ సినిమాని హిందీ లో కూడా ఏక్ దుజే కేలియే అనే టైటిల్ తో తీశారు.
కమల్ హస్సన్ మొదటి హిందీ సినిమా కూడా ఇదే.దీనిని కూడా బాలచంద్రగారే డైరెక్ట్ చేస్తే.
LV ప్రసాద్ గారు ప్రొడక్షన్ అందించారు.ప్రసాద్ గారు చివరి హిందీ సినిమా కూడా ఇదే.
దీనిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు మొదటి హిందీ పాట పాడారు.ఇక ఈ సినిమా అక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.
అయితే ఈ సినిమా యూత్ కి ఎక్కువగా కనెక్ట్ అవ్వడంతో మరో చరిత్ర సినిమాలోలాగే చాలామంది ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు.
దాంతో ఈ సినిమా 200 డేస్ ఫంక్షన్ లో బాలచంద్ర గారు నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు ఈ సినిమా తీయడం అని అందరికి క్షమాపణ చెప్పారు.
అదండీ మరో చరిత్ర వెనక ఉన్న ఎన్నో విషయాలు.
దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!