తెలుగు సినిమా పరిశ్రమ గురించి ఎవరికి తెలియని అద్భుతాలు

తెలుగు సినిమా భక్త ప్రహ్లాద చిత్రంతో పురుడు పోసుకుంది.1931లో పౌరాణిక కథతో హెచ్ఎం రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఆ తర్వాత నెమ్మదిగా దినదినాభివ్రుద్ధి చెందింది.1950-60 మధ్యకాలంలో సినిమా రంగం స్వర్ణయుగాన్ని అనుభవించింది.

టెక్నాలజీ పరంగా నూతన ఒరవడి సంపాదించుకుంది.కథల విషయంలో కొత్త ప్రయోగాలకు వేదికైంది.

ఎందరో ట్యాలెంటెడ్ నటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయకులు, గొప్ప టెక్నీషియన్లు ఇదే సమయంలో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

హిందీలో వచ్చిన సినిమాలతో పోటీ పడుతూ సంఖ్యాపరంగా కొన్నిసార్లు అక్కడి కంటే ఇక్కడే ఎక్కువ సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలున్నాయి.

ఘన చరిత్ర కలిగిన తెలుగు సినిమా పరిశ్రమలో కీలక ఘట్టాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

• మొట్టమొదటి సినిమా థియేటర్ యజమాని ర‌ఘుప‌తి వెంక‌య్య.1921లోనే మ‌ద్రాస్‌లో గెయిటీ, క్రైన్‌, రాక్సీ థియేట‌ర్లు ప్రారంభించాడు.

• ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలి థియేట‌ర్ మారుతీ సినిమా థియేటర్.పోతినేని శ్రీనివాసరావు 1921లో విజయవాడలో స్థాపించాడు.

• తెలుగులో తొలి టాకీ చిత్రం హెచ్‌.ఎం.

రెడ్డి దర్శకత్వంలో వచ్చిన భ‌క్త ప్ర‌హ్లాద • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలి స్టూడియో దుర్గా సినీటోన్‌.

1936లో నిడ‌మ‌ర్తి సూర‌య్య‌ రాజ‌మండ్రిలో స్థాపించారు. """/"/ • తెలుగులో తొలి ద‌ర్శ‌కురాలుగా భానుమ‌తి గుర్తింపు పొందారు.

1953లో చండీరాణి అనే సినిమాకు ఆమె దర్శకత్వం వహించారు. """/"/ • తొలి తెలుగు రంగుల చిత్రం ల‌వ‌కుశ.

1963లో వచ్చిన ఈ సినిమాకు సి పుల్లయ్య దర్శకత్వం వహించాడు. """/"/ • ఉత్త‌మ న‌టునిగా అంత‌ర్జాతీయ బ‌హుమ‌తి పొందిన తొలి తెలుగు న‌టుడిగా ఎస్వీ రంగారావు గుర్తింపు పొందాడు.

న‌ర్త‌న‌శాల‌లో కీచ‌కుని పాత్ర‌కు గాను 1964లో జ‌కార్తా ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ లో అవార్డు అందుకున్నాడు.

"""/"/ • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందిన తొలి తెలుగు సినిమా వ్య‌క్తిగా బి.

ఎన్‌.రెడ్డి ఘనత సాధించారు.

"""/"/ • ఉత్త‌మ‌న‌టిగా తెలుగు సినిమాకు జాతీయ అవార్డు అందించిన‌ న‌టి శార‌ద.

1978లో నిమ‌జ్జ‌నం సినిమాతో ఈ గౌరవాన్ని దక్కించుకుంది. """/"/ • పాట‌ల రికార్డుల అమ్మ‌కంలో సరికొత్త ఘనత సాధించిన తొలి తెలుగు సినిమా శంక‌రాభ‌ర‌ణం.

"""/"/ • 3-డిలో నిర్మాణ‌మైన తొలి తెలుగు చిత్రం 1985లో విడుదలైన సాగ‌ర్ సినిమా.

• 70 ఎంఎంలో నిర్మాణ‌మైన తొలి తెలుగు చిత్రం 1986లో విడుదలైన సింహాస‌నం.

వావ్.. గూగుల్‌లో వర్క్‌లైఫ్ అదుర్స్ కదూ.. టెక్కీ షేర్ చేసిన వీడియో వైరల్