అక్కినేని ఆత్మహత్య చేసుకోవాలని సముద్రం దగ్గరికి ఎందుకు వెళ్ళాడు

మామూలుగా మన పెద్దవాళ్ళు పుణ్యం కొద్ది పురుషుడు అని అంటూ ఉంటారు కానీ.

అక్కినేని నాగేశ్వరావు గారి విషయంలో పుణ్యం కొద్దీ పూర్ణ అని అంటారు.ఏంటి పూర్ణ అంటున్నారు అనుకుంటున్నారా.

పూర్ణ అంటే నాగేశ్వరావు గారి అర్ధాంగి.ఆయన వ్యక్తిత్వంలోని చల్లదనం ఆయన ముఖంలోని అరవిందం ఇవన్నీ కూడా పూర్ణ నింపిన అందాలే.

అక్కినేని నాగేశ్వర రావు గారి భార్యగా అన్నపూర్ణ అడుగుపెట్టిన తర్వాతే ఆయన జీవితం పరిపూర్ణంగా మారింది.

పూర్ణమ్మ తోడుగా ఉండడం వల్లనే నాగేశ్వరావు గారి నటన కళా పరిపూర్ణమైంది.అక్కినేనిది కృష్ణాజిల్లా వెంకటరంగాపురం.

అక్కినేని నాగేశ్వరావు గారు నాలుగు ఏళ్ళ వయస్సుప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారు.ఆస్తి పంపకాలలో అన్నదమ్ములకు తలొక 5 ఎకరాలు వచ్చాయి.

అప్పట్లో ఎకరం 600 రూపాయలు పలికేది.ఒక్కొక్కళ్ళకి 3000 రూపాయల ఆస్తి అన్నమాట.

ఆ 3000 రూపాయల పెట్టే అక్కినేని చదువుకోవాలి.ఎందుకంటే వారి వంశంలో ఎవరికీ చదువు లేదు.

ఒకవేళ అక్కినేని చదువుకుంటే చదువు అబ్బుతుందో లేదో అన్న విషయం తెలీదు.3000 రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత సరైన ఉద్యోగం రాదేమో అని భయపడింది అక్కినేని వాళ్ళ అమ్మ.

ఉన్నదంతా చదువు కోసం ఖర్చుపెడితే ఎలా అనే ఆలోచనలో ఉంది అక్కినేని అమ్మగారు .

అప్పట్లో అక్కినేని పాటలు పాడేవాడు.కోలాటం ఆడేవాడు.

కనీసం వాటిల్లో అయినా పైకి ఎదుగుతాడు అనుకుని నాటకాల్లో చేర్పించమని అక్కినేని వాళ్ళ అన్నయ్యకి చెప్పింది.

దాంతో 9 ఏళ్ల వయసులో తొలిసారిగా ముఖానికి రంగు వేసుకున్నాడు. """/"/ అప్పటి నుంచి 19 ఏళ్ల వయసు వరకూ స్టేజి మీద జీవితం గడిచిపోయింది.

మొదటి నాటకానికి అర్ధ రూపాయి తీసుకున్నా ఆఖరి నాటకానికో 5 రూపాయలు తీసుకున్నాడు.

ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో అడుగుపెట్టి నిలదొక్కుకున్నాడు.ఆ తరువాత మిగిలింది పెళ్లి.

కానీ పిల్ల దొరకలేదు.అప్పట్లో సినిమావాళ్ళకి ఎవరు పిల్లని ఇచ్చేవారు కాదు.

ఈ ఫీల్డ్ లో చెడిపోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని భావించేవడమే అందుకు కారణం.

చివరికి అక్కినేని వాళ్ళ మేనమామ కూడా తన కూతురిని అక్కినేనికి ఇచ్చి పెళ్లి చేయను అని చెప్పాడు.

దానితో కొంతమంది శ్రేయోభిలాషులు ముందుండి ఒక మంచి అమ్మాయిని చూసి అక్కినేనికి పెళ్లి చేయాలని చూసారు.

కానీ ఎంత వెతికిన పిల్ల దొరకలేదు.ఆ క్రమం లో ఒకరోజు పేకాటలో ఫ్రెండ్ అయిన అక్కినేని మామగారు తన అమ్మాయిని చేసుకోవడానికి ఒక మంచి కుర్రాడు ఎవరన్నా ఉంటే చెప్పమని అడిగాడట.

అప్పుడు కొంతమంది అక్కినేని పేరు చెప్పారట.దీనితో అక్కినేని మామగారు అన్నపూర్ణమ్మను ఇచ్చి నాగేశ్వరావు గారికి పెళ్లి చేయడానికి ముందుకు వచ్చారు.

అప్పటికి వాళ్ళ బంధువులు అంతా సినిమా వాళ్ళకి పిల్లను ఇవ్వవద్దని వొత్తిడి చేశారట.

అయినా గాని అక్కినేని మామగారు నమ్మలేదు.అక్కినేని మీద నమ్మకంతో ఉన్నారు.

తరువాత అన్నపూర్ణమ్మను ఇచ్చి పెళ్లి చేసారు.అన్నపూర్ణమ్మను ఒక మంచి భార్య అనడం కంటే ఒక మంచి స్త్రీ అని అనాలి.

ఎందుకంటే అక్కినేని ఆలోచనలలో ముందుండి, ఆయన వెనక ఉండి నడిపించడంలో ఆమెను ఇతర స్త్రీలు ఆదర్శంగా తీసుకోవాలి.

తన చుట్టూ ఎంత మంది అమ్మాయిలు ఉన్నాగాని ఎప్పుడు చలించేవాడు కాదు అక్కినేని.

"""/"/ అయితే ఒకానొక సమయంలో నపుంసకుడు, అసలు మగాడే కాదు, ఆడపిల్లల్ని చూడడు, అసలు ఆడవాళ్ళతో మాట్లాడేవాడే కాదు అని అందరు అంటూ ఉంటే అక్కినేని అప్పట్లో ఎంతగానో సిగ్గుపడేవాడట.

ఆ మాటలకు అవమానంగా ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకోవాలని రెండు సార్లు సముద్రం దగ్గరకు కూడా వెళ్ళాడట.

అలాంటి పరిస్థితులలో అన్నపూర్ణమ్మ అక్కినేని జీవితంలోకి అడుగు పెట్టింది.తను మాములుగా రాలేదు.

ఎన్నో సుఖ సంతోషాలను, ఎంతో అదృష్టాన్ని తన వెంట తీసుకుని వచ్చింది.ఓర్పులో భూదేవి అన్నపూర్ణమ్మ.

హీరోల భార్యలకు ఓర్పు అనేది చాలా ముఖ్యం.అందులోని అక్కినేని లాంటి రొమాంటిక్ హీరో భార్యకు మరింత ఓర్పు ఉండాలి.

చుట్టుపక్కలవారు, కొంతమంది హీరోయిన్స్ మీ ఆయన పలానా హీరోయిన్స్ తో భలే నటించారే.

చాలా నాచురల్ గా చేస్తారే అని అన్నపూర్ణమ్మను రెచ్చకొట్టేవారు.కానీ దానికి ఆవిడ కోపం తెచ్చుకునేది కాదు.

తిరిగి కౌంటర్ రూపంలో అలా నటిస్తారు కాబట్టే మా ఆయనకి రొమాంటిక్ హీరో అనే పేరు వచ్చిందని నవ్వేసేదట.

ఎదుటివాళ్ళ ఆలోచనలను చదివే తెలివితేటలు ఉన్నవాళ్లు మాత్రమే అలా మాట్లాడగలరు.లేకపోతే అంతమంది అందమైన హీరోయిన్లతో తన భర్త కలిసి నటిస్తుంటే, వాళ్ళతో సన్నిహితంగా ఉంటుంటే చూసి భరించడానికి ఎంత ఓర్పు ఉండాలి చెప్పండి.

అన్నపూర్ణమ్మ మంచి భార్యే కాదు.మంచి తల్లి కూడా.

సినిమాలు అంటూ ANR గారు తిరుగుతూ ఉంటే తానే పిల్లల బాధ్యత తీసుకుని పెంచి పెద్ద చేసింది.

పిల్లల మంచి, చెడు అన్నపూర్ణమ్మ గారికి తెలిసినంతగా నాగేశ్వరావుగారికి కూడా తెలియదట.పిల్లల్ని ఈ విషయంలోనూ శాసించేది కాదు.

రూల్స్ పెట్టేది కాదు.తల్లి లేని సుమంత్ ను తానే పెంచి పెద్ద చేసింది.

ముఖ్యంగా నాగార్జున అంటే తనకు ఎంత ప్రేమనో.నాగార్జునకి కూడా తల్లి అంటే అంతే ప్రేమ.

రైతుబిడ్డ యాడున్నావ్.. ఆ పైసలెక్కడ.. యువసామ్రాట్ రవి కామెంట్స్ వైరల్!