ఒక నటుడు.. ఒక రచయిత.. ఓంకార్

ఓంకార్.ఈ పేరు వినగానే స్టార్ మాలో వన్ మినట్ అంటూ సిక్త్ సెన్స్ షోతో జనాలకు చిర్రెత్తించే హోస్ట్ గుర్తుకు వస్తాడు.

ఇంకాస్త వెనక్కి వెళ్తే.జీ తెలుగులో ప్రసారం అయిన ఆట డ్యాన్స్ షో యాంకర్ గుర్తుకొస్తాడు.

కానీ ఈ ఓంకార్ కాదు.దివంగత నటుడు, దర్శకుడు, రచయిత ఓంకార్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఒకప్పుడు తెలుగు రాష్ట్రంలో సీరియల్స్ జనాల ముందుకు అప్పుడప్పుడే పరిచయం అవుతున్న వేళ.

ఓంకార్ మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.నిన్నే పెళ్లాడతా, పవిత్రబంధం, ఇది కథ కాదు, ఆదివారం ఆడవాళ్లకు సెలవు లాంటి పాపులర్ సీరియల్స్ లో నటించాడు.

పవిత్రబంధం ధారావాహికలో దామోదరం అనే క్యారెక్టర్ ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చింది.చూడ్డానికి పద్దతిగా కనిపిస్తూ కన్నింగ్ ఆలోచనలతో కాపురాలను కూల్చే పాత్రలో అద్భుతంగా నటించాడు ఓంకార్.

విజయవాడ సమీపంలో పుట్టి పెరిగిన ఆయన.చదువు పూర్తి కాగానే రేడియోలో న్యూస్ రీడర్ గా జాయిన్ అయ్యాడు.

చక్కటి కంఠంతో ఆయన వార్తలు చదువుతుంటే జనాలకు ఈజీగా అర్థం అయ్యేవి.నెమ్మదిగా పత్రికలకు వ్యాసాలు రాయడం మొదలుపెట్టాడు.

ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు.పలు సినిమాల్లో నటించాడు.

"""/"/ నరేష్ హీరోగా వచ్చిన సినిమా పోలీస్ భార్యలో ఓంకార్ నటన మంచి గుర్తింపు తెచ్చింది.

అటు రాజశేఖర్ హీరోగా చేసిన ఆఫ్తుడు సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేశాడు.

ఆ తర్వాత పందిరిమంచం అనే సినిమాకు ఓంకార్ దర్శకత్వం వహించాడు.ఆయన చేసినవి తక్కువ సినిమాలు, సీరియల్స్ అయినా జనాల నుంచి మంచి ఆదరణ పొందాడు.

నటుడిగానే కాదు.రచయితా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

"""/"/ స్వాతి దినపత్రికలో ఓంకారం పేరుతో వరుసగా వ్యాసాలు ప్రచురితం అయ్యాయి.

అంతేకాదు.తను రాసిన ఓంకార్ క్యాష్ మంత్రాస్ బాగా గుర్తింపు పొందింది.

జనవరి 2007లో ఓంకార్ గుండెపోటుతో చనిపోయాడు.ఓంకార్ కొడుకే నిరుపమ్ పరిటాల.

పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు పొందాడు.

Naivedyam : దేవుడు నైవేద్యం తినడు కదా.. మరి నైవేద్యం ఎందుకు సమర్పిస్తారో తెలుసా..?