సినిమా స్టార్స్ కి నాట్యం నేర్పించిన వెంపటి చిన సత్యం గురించి ఈ విషయాలు తెలుసా ?

వేంపటి చిన సత్యం గారు.కూచిపూడి లో ఈయన నాట్యాచార్యులుగా పనిచేసిన విషయం మనందరికీ తెలిసిందే.

టాలీవుడ్ లో స్టార్ సెలబ్రిటీలకు సైతం నాట్యం నేర్పిన గురువుగా సత్యం గారికి మంచి పేరుంది.

ఈయన నాట్యం నేర్చుకున్నది మాత్రం దివంగత నాట్యచార్యులైన వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారి వద్ద, ఆ తర్వాత కొన్నాళ్లపాటు తాడేపల్లి పేర్ని శాస్త్రి గారి వద్ద కూడా నాట్యం నేర్చుకున్నారు.

ఇక చిన్న సత్యం గారు వరలక్ష్మమ్మ, శరమయ్య దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు.

మద్రాసులో భరతనాట్యం మాత్రమే ఎంతో ఘనంగా విరాజిల్లుతున్న సమయంలో కూచిపూడి డాన్స్ ని చెన్నైలో ప్రతి ఒక్కరికి దగ్గర చేయడంలో వెంపటి చిన సత్యం గారి కృషి ఎనలేనిది.

భరతనాట్యం ను మించి కూచిపూడి కి ప్రాధాన్యత ఉందని ప్రతి ఒక్కరికి తెలియజేసి దానికి ధీటైన స్థానాన్ని సంపాదించి పెట్టారు చిరసత్యం గారు.

విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చారు. """/"/ కూచిపూడి కి విశేష పేరు ప్రఖ్యాతులు రావడంలో చినసత్యం గారు చేసిన కృషి కూడా మరువలేనిది.

1963లో మద్రాసు లో ఆయన సొంతంగా కూచిపూడి నాట్య అకాడమీని నెలకొల్పారు.ఈ సంస్థ ద్వారా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతోమందికి ఆయన నాట్యం నేర్పించారు.

ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ అయిన పద్మా మీనన్, వాణిశ్రీ, ప్రభ, వైజయంతి మాల వంటి వారందరూ కూడా ఆయన దగ్గర శిష్యరికం చేసిన వారు.

ఇక ఒక సినిమా కోసం ఎన్టీఆర్ """/"/కూడా చిన సత్యం గారి వద్ద కొన్నాళ్లపాటు నృత్యం నేర్చుకున్నారు.

ఎన్టీఆర్ కి ఆయన అంటే అంతులేని అభిమానం.అందుకే ఆయన కూతుల్లు అయిన పురందరేశ్వరి, భువనేశ్వరి లకు కూడా చిన సత్యం గారి వద్దే నాట్యం నేర్పించారు.

"""/"/ వాస్తవానికి తన అన్న వెంపటి పెద సత్యం వద్ద శిష్యరికం చేయడం కోసం 1947 లో తొలిసారి మద్రాస్ కు పయనం అయ్యారు చిన్న సత్యం.

ఇక అక్కడ మొదలైన ఆయన నాట్య ప్రస్థానం ఎన్నో ఏళ్ల పాటు సాగింది.

1984లో అమెరికాలోని ఫిక్స్ బోర్డ్ లో అక్కడ ఆస్థాన దేవస్థానమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో నాట్య చర్యుడిగా కొన్నాళ్లపాటు పని చేశారు.

ఇక 2800 మంది కళాకారులతో హైదరాబాదులో 2011 వ సంవత్సరంలో ఏకకాలంలో కూచిపూడిపై నృత్యం కార్యక్రమం నిర్వహించి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సాధించడంతోపాటు గిన్నిస్ రికార్డును సైతం సంపాదించుకున్నారు.

"""/"/ ఇక ఆయన వ్యక్తిగత విషయానికొస్తే ఒక భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు.

ఇక వెంపటి చినసత్యం గారి కుమారుడైన రవిశంకర్ కూడా నాట్యాచార్యుడే కావడం విశేషం.

ఇక చివరిగా 2012 జూలై 29వ తారీఖున ఆయన మద్రాస్ లోనే తన నాట్య క్షేత్రమైన కూచిపూడి అకాడమీలోనే తుది శ్వాస విడిచారు.

కెరియర్ లో ఎన్నో పురస్కారాలు అందుకుని ఎంతోమంది శిష్యులను తయారు చేసి అనేక నృత్య రూపకాల ఇవ్వడంలో వెంపటి చిన సత్యం యొక్క కృషి ఎనలేనిది.

మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిన తెలంగాణ యువకుడు.. ఇతని సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!