డ్రగ్స్ కేసులో ఇన్ని లొసుగులా ?.. బయట ప్రపంచానికి తెలియని వాస్తవాలు
TeluguStop.com
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే వార్త వైరల్ గా మారిపోతుంది.
హైదరాబాద్ లో ఒక పబ్ పై పోలీసుల దాడి జరగడం ఇక అక్కడ డ్రగ్స్ దొరికాయి అంటూ వార్తలు బయటకు రావడం.
ఇక ఏకంగా అప్పటి వరకు పబ్ లో ఉన్న 150 మందిని పోలీసులు అరెస్టు చేసి నేరుగా పోలీస్ స్టేషన్కు తరలించడం.
ఇక ఇలా పోలీస్ స్టేషన్ కు తరలించిన వారిలో ప్రముఖ సెలబ్రిటీలు ఉండడంతో ఇక ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక ఎవరు చూసినా ఇక ఈ వ్యవహారం గురించి బ్రేకింగ్ న్యూస్ అంటూ రాసేస్తున్నారు.
వారి పేరు బయటపడింది వీరి పేరు బయటపడింది అంటూ స్క్రోలింగులు ఇస్తున్నారు.అయితే నాణానికి రెండు వైపులు ఉన్నట్లుగానే ఈ కేసులో మరో కోణం కూడా ఉంది అన్నది కొంతమంది అనుకుంటున్న మాట.
నిబంధనలు ఉల్లంఘించి సమయం దాటిన తర్వాత పబ్ నిర్వహిస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.వాస్తవానికి అయితే రాడిసన్ బ్లూ తో పాటు మరొక పబ్ కూ కూడా 24 గంటలు నిర్వహించేందుకు అనుమతి ఉంది.
ఇది కూడా పక్కన పెడితే.ఇక పబ్ పై దాడులు చేసి 150 మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
అయితే వినియోగదారుడు నేరస్తులు ఎలా అవుతాడు అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్న మాట.వ్యభిచార కొంపల పై దాడి చేసి అందర్నీ పట్టుకు పోయినట్టు పబ్ మీద దాడి చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి రాడిసన్ బ్లూ పబ్ హై ప్రొఫైల్ ఉన్నది అక్కడ చిల్లర గొడవలు చేసేవారు అస్సలు కనిపించరు.
అక్కడికి వెళ్లాలంటే ప్రతి ఒక్కరికి ఒక పాస్వర్డ్ ఉంటుంది.అంతేకాదు డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది.
అలా ఉంటేనే లోపలికి అనుమతిస్తూ ఉంటారు.అంతేకాదు ఇక ఆ పబ్ నీ లీజుకు తీసుకొని నడిపిస్తున్న ఉప్పల అభిషేక్ రాజుపై ఇప్పటి వరకు ఎలాంటి నెగిటివ్ రిమార్క్స్ కూడా లేకపోవడం గమనార్హం.
"""/"/
అయితే అసలు పోలీసులు ఎవరిని టార్గెట్ చేసి దాడి చేసారు అన్నది కూడా ప్రస్తుతం ఎవరికీ తెలియని ప్రశ్న.
అంతేకాకుండా ఇక పబ్బులో 5 గ్రాముల డ్రగ్స్ దొరికాయి అంటూ పోలీసులు చెప్పారు.
150మంది ఉన్న పబ్బులు 5 గ్రాముల డ్రగ్స్ అంటే ఎవరివి అని ప్రశ్నలు కూడా ఎదురవుతూన్నాయ్.
అంతే కాకుండా ఇక పబ్బుల్లో దొరికిన వాళ్ళందరూ డ్రగ్స్ వాడుతున్నారంటూ ఒక ముద్ర కూడా వేసారు.
ఇందులో బాగా ఫేమస్ వ్యక్తులు కూడా ఉన్నారు.ఇలా ఎలాంటి విచారణ చేయకుండా డ్రగ్స్ వాడుతున్నట్లు ఎలా ముద్రవేశారు కొంతమంది అడుగుతున్న ప్రశ్నలు.
ఇదేనేమో నాణానికి మరో వైపు ఉంటే.
ఇదేందయ్యా ఇది.. ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ లో ఆ పెద్దాయన ఏకంగా.?