మారిన ట్రెండ్.. హీరోలను కాదు.. డైరెక్టర్లను చూసే ప్రేక్షకులు వస్తున్నారట!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇదివరకు హీరోలకు ఉన్న మాస్ ఫాలోయింగ్‌ను దర్శకులు కబ్జా చేస్తునట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

కారణం.ఒకప్పుడు జనాలు సినిమాలకు వెళ్ళాలంటే ప్రస్తుతం థియేటర్లలో ఏ మూవీ రిలీజ్ అయ్యిందో కనుక్కునే వారు.

ఆ తర్వాత అందులో హీరో, హీరోయిన్ ఎవరని వాకబు చేశాకే ప్రోగ్రాం ప్లాన్ చేసుకునేవారు.

కానీ ఇప్పుడు అలా జరగడం లేదంట.ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

దేశంలో కరోనా ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తే.సెకండ్ వేవ్ తర్వాత సినిమా ఇండస్ట్రీ భారీగా నష్టపోయింది.

కొన్ని నెలల పాటు సినిమా హాల్స్ మూసివేసే ఉన్నాయి.థియేటర్లకు వెళ్ళాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

ఆ తర్వాత కొవిడ్ ప్రభావం తగ్గాక థియేటర్లు ఓపెన్ అయ్యాయి.కానీ, విడుదలకు సినిమాలు రెడీగా లేవు.

ఒకవేళ చిన్న సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నా జనాలు వస్తారా.రారా అని సందేహంతో కొన్ని ప్రాంతాల్లో అసలు థియేటర్లు ఓపెన్ కూడా చేయలేదు.

ఒకవేళ తెరిచినా రినోవేషన్ పనులు చేయించుకున్నారు.సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గుముఖం పడుతుందని వైద్యశాఖ తెలిపాకే తెలంగాణలో థియేటర్లు ఓపెన్ అయ్యాయి.

కానీ ఆశించినంత ఆక్యూపెన్సీ లేదు.జనాలు కూడా సినిమా హాల్స్‌కు వచ్చి మూవీ చూసేందుకు ఆసక్తి కనబరచలేదు.

అందరూ ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌కు అలవాటు పడిపోయారు.ఇప్పుడిప్పుడే కరోనా మీద భయం తగ్గడంతో జనాలు థియేటర్ల వైపు చూస్తున్నారు.

కానీ ఇటీవల విడుదలైన సినిమాలన్నీ దర్శకులవే.అంటే హీరోలను చూసి కాకుండా ఈ సినిమాకు ఎవరు డైరెక్షన్ చేశారని కనుక్కుని ప్రేక్షకులు సినిమా హాల్స్‌కు వెళ్లేవారు.

బడా హీరోల సినిమాలు ఇప్పట్లో విడుదలకు రెడీగా లేకపోవడంతో.కొత్తగా ఏ మూవీ విడుదలైనా అందులో ‘దర్శకుడే’ ఎక్కువగా ఫోకస్ అయ్యాడని చెప్పవచ్చు.

హీరోలు మాత్రం ఎలివేట్ కాలేదన్నది అక్షరసత్యం. """/"/ ఎక్కడిదాకో ఎందుకు.

మొన్న విడుదలైన ‘లవ్ స్టోరీ’ మూవీ విషయానికొస్తే.హీరో నాగ చైతన్య కంటే కూడా ఆ చిత్ర దర్శకుడైన శేఖర్ కమ్ములను చూసి చాలా మంది థియేటర్లకు వచ్చారని జోరుగా చర్చ నడుస్తోంది.

అందువల్లే ఓపెనింగ్స్ కూడా ఆ రేంజ్‌లోనే జరిగాయని చెప్పక తప్పదు.దసరాకు విడుదలవుతున్న అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీ సైతం డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ పేరు మీదే నడుస్తుందని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

బడా హీరోల సినిమాలు రిలీజ్ అయ్యే వరకు.ప్రేక్షకులు దర్శకుల పేర్లు, వారి ఖాతాల్లో ఉన్న హిట్లను చూసే థియేటర్లకు వస్తారని తెలుస్తోంది.

దర్శకుడు రాజమౌళి ఎప్పుడైతే హీరోలతో సంబంధం లేకుండా తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ వచ్చాడో.

నాటి నుంచి హీరోలకు బదులు దర్శకులను చూసే ప్రేక్షకులు సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారని.

రాజమౌళి దర్శకుల కోసం కొత్త ట్రెండ్ సెట్ చేశారని చెప్పుకుంటున్నారు.ః.

Keratin Treatment : ప్ర‌తి నెలా కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారా.. అయితే మీరు డేంజ‌ర్ లో ప‌డ్డ‌ట్లే!