షావుకారు హీరోగా ఏఎన్నార్ స్థానంలో ఎన్టీఆర్ ఎందుకు వచ్చాడో తెలుసా?

షావుకారు.తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుత సినిమా.

ఎన్టీఆర్ ను హీరోగా నిలబెట్టిన సినిమా.హీరోయిన్ జానకికి ఇంటిపేరుగా మారిన సినిమా.

అయితే ఈ సినిమా విషయంలో చాలా ఆసక్తికర విషయాలు జరిగాయి.తొలుత ఈ క్లాసిక్ సినిమాలో హీరోగా అక్కినేని నాగేశ్వర్ రావును అనుకున్నారు అయితే దర్శకుడు చక్రపాణికి ఏఎన్నార్ తో సినిమా చేయడం ఇష్టం లేదు.

అందుకే ఎల్వీ ప్రసాద్ ఈ సినిమా షూటింగ్ కు ఏర్పాట్లు చేసుకున్నప్పుడల్లా.చక్రపాణి ఏదో ఒక వంక చెప్పి సినిమా షూటింగ్ జరగకుండా చూసేవాడు.

అలా రెండుసార్లు జరిగింది.మరో నిర్మాత నాగిరెడ్డి సినిమా షూటింగ్ గురించి ఎల్వీ ప్రసాద్ ను అడిగేవాడు.

ఓ రోజు ఎల్వీ ప్రసాద్ మీద సీరియస్ అయ్యాడు.నాగిరెడ్డి గారు.

సినిమా ఆలస్యం గురించి చక్రపాణి గారిని అడగాలని చెప్పాడు.నాగిరెడ్డికి ఏం జరుగుతుందో తెలియక చక్రపాణి వైపు చూశాడు.

చక్రపాణి చిన్నగా నవ్వి.ప్రతి సినిమా కథకు ఓ ఆత్మ ఉంటుంది.

అందుకే ఆ ఆత్మ అభిరుచికి తగిన హీరోను సెలెక్ట్ చేయాలి అని చెప్పాడు.

దానికి నాగిరెడ్డి చిరాకు పడ్డాడు.అసలు విషయం చెప్పాలన్నాడు.

ఈ సినిమా హీరోను మార్చాలా? అక్కినేనికి ఏమైంది? అని ప్రశ్నించాడు.ఈ కథకు ఫామ్ లో ఉన్న హీరో కాదు.

కథనే ఫామ్ లోకి తెచ్చే హీరో కావాలి అని చెప్పాడు.అంటే రామారావు ఓకేనా అన్నాడు.

అవును అన్నాడు చక్రపాణి. """/"/ ఈ సంభాషణ జరిగిన కొద్ది రోజులకు రామారావు, జానకి హీరో హీరోయిన్లుగా సినిమా షూటింగ్ మొదలయ్యింది.

తక్కువ కాలంలోనే సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.1950 ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదలైంది.

అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు.అయితే క్లాసిక్ సినిమాగా మిగిలిపోయింది.

సినిమా అయితే ఆడలేదు గానీ.రామారావుకు మంచి గుర్తింపు తెచ్చింది.

ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు.

36 ఏళ్ల తర్వాత టీమిండియాపై న్యూజిలాండ్ సంచలన విజయం