సావిత్రి ఇంటికి వెళ్లి 5 రూపాయలు వసూలు చేసిన ఎన్టీఆర్.. అసలు ఏం జరిగింది?

ఎన్టీఆర్ వంటి వ్యక్తికే ఐదు రూపాయల కోసం కష్టాలు తప్పలేదు.ఇది ఆయన సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు జరిగిన సంఘటన కాదు.

సినిమాల్లో స్టార్ హీరోగా ఆ ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే అన్న గారు ఎన్టీఆర్ ఐదు రూపాtయల కోసం ఏకంగా సావిత్రి ఇంటికి వెళ్లి మరి డబ్బులు వసూలు చేసుకున్నారట.

మరి అసలు ఆ డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? అనే విషయం ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం పదండి.

ఇప్పుడైతే సినిమాకి ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇస్తారు అని అడిగే రోజులు.కానీ నాటి రోజుల్లో అలా కాదు నెలవారీ జీతాలకు హీరో హీరోయిన్స్ నటీనటులు అంతా కూడా పనిచేసేవారు.

ఎన్టీఆర్, అక్కినేని, జగ్గయ్య, సావిత్రి అంతా కూడా నెలవారి జీతాలకే పని చేసేవారు.

అవి మిస్సమ్మ సినిమా కోసం ఎన్టీఆర్, సావిత్రి, జగ్గయ్య, సూర్యకాంతమ్మ పనిచేసిన రోజులు.

అందరికీ కలిపి ఒకేసారి వేతనాలు ఇచ్చే అలవాటు వాహిని స్టూడియోకి ఉండేది.ఏమైనా అడిగితే మీరంతా కలిసి పని చేస్తారు కదా కలిసి పంచుకోండి అంటూ ఒక ఉచిత సలహా ఇచ్చేవారు.

అలా ఈ నలుగురు నటీనటులకు కలిపి ఒకే చెక్కు రూపంలో ఎన్టీఆర్ చేతిలో పెట్టేసారు వాహిని స్టూడియో యజమాని.

"""/" / ఇక ఆ సమయంలో అన్నగారికి 75 రూపాయలు, సావిత్రి కి 70, రేలంగికి 55, అక్కినేని 35 రూపాయల చొప్పున పారితోషకం ఇచ్చారట అయితే పంపకాలు జరిగిన తర్వాత సావిత్రి దగ్గరికి 80 రూపాయలు వెళ్ళగా ఎన్టీఆర్ కి 70 రూపాయలు మిగిలాయట.

దాంతో మిగతా ఐదు రూపాయలు తెల్లవారి షూటింగ్లో ఇస్తానని సావిత్రి వెళ్లిపోయిందట.కానీ నెల గడిచినా కూడా మళ్ళీ సావిత్రి, ఎన్టీఆర్ కలవలేదు మరొక షూటింగ్ విషయంలో సావిత్రి బిజీగా ఉండి డబ్బులు ఇవ్వలేకపోయింది.

దాంతో అప్పటికే తన చేతిలో ఉన్న డబ్బుంతా కూడా ఇంటికి పంపేసిన ఎన్టీఆర్ ఎలాగైనా సావిత్రి దగ్గరికి వెళ్లి ఐదు రూపాయలు తీసుకొని తన రోజువారి ఖర్చులకోసం గడుపు పోవాలని అనుకున్నారట.

అలా సావిత్రి ఇంటికి వెళ్లి ఐదు రూపాయలు వసూలు చేశారట.దాంతో ఆ విషయంలో చాలా రోజులపాటు జగ్గయ్య సావిత్రి జోకులు వేస్తూ ఆట పట్టించే వారట అన్నగారిని.

పవన్ నియోజకవర్గంలో నేడు జగన్ టూర్