డిస్ట్రిబ్యూటర్స్ పక్కన పెట్టిన సినిమాను హిట్ కొట్టించిన రామానాయుడు..
TeluguStop.com
సుమన్ అరెస్టు.అప్పట్లో సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపింది.
ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి.అప్పుడే మొదలైన సినిమా అలెగ్జాండర్.
ఈ సినిమాకు నిర్మాతగా సత్యనారాయణ వ్యవహరించాడు.ఆ రోజుల్లోని పరిస్థితులు ఆయనను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి.
ఈ సినిమాను ఎలాగోలా తీశాం.కానీ విడుదల అవుతుందా? కాదా? అనే భయం కలిగింది.
వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేయాలనుకున్నాడు.వెంటనే రీలీజ్ డేట్ ప్రకటించాడు.
కానీ బయ్యర్ల నుంచి ఆయను తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.సినిమా బాగా లేదన్నారు.
అంతేకాదు.హీరో మీద ఏవేవో ఆరోపణలు వస్తున్నాయి.
మేము సినిమా విడుదల చేయలేం అని చేతులెత్తేశారు.నిజానికి అప్పట్లో సినిమా రిలీజ్ అనేది డిస్ట్రిబ్యూటర్స్ చేతుల మీదుగా కొనసాగేది.
నిర్మాత కేవలం సినిమా వారికి చూపించడం మాత్రమే చేసేవాడు.ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ కావాలి? ఎన్ని థియేటర్లలో విడుదల కావాలి? అనే విషయాలను డిస్ట్రిబ్యూటర్స్ చూసేది.
కానీ వాళ్లు అలెగ్జాండర్ సినిమాను పక్కకు పెట్టారు.నిర్మాత సత్యనారాయణకు ఏం చేయాలో అర్థం కాలేదు.
ఈ గండం నుంచి తనను బయట పడేసే ఏకైక వ్యక్తి రామానాయుడు అనుకున్నాడు.
విడుదల ఎల్లుండి అనగా.ఇవాళ రామానాయుడు దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు సత్యనారాయణ.
"""/"/
ఆరోజుల్లో డిస్ట్రిబ్యూటర్స్ పక్కన పెట్టిన సినిమాల గురించి ఎవరూ జోక్యం చేసుకునేవారు కాదు.
కానీ నిర్మాతల ఇబ్బందులు ఏంటో రామానాయుడుకు బాగా తెలుసు.వెంటనే ఈ సినిమాను తన స్టూడియోలో వేయించుకుని చూశాడు.
ఈ సినిమాలో కొన్ని సీన్లను మార్చాలని చెప్పాడు.ఆ సినిమా దర్శకుడు రంగారావును పిలిచి.
సినిమాలో పలు మార్పులు చేయించాడు.అన్ని ఛేంజస్ చేశాక.
డిస్ట్రిబ్యూటర్స్ ను పిలిచాడు రామానాయుడు.ఈ సినిమాను చూసి వాళ్లు ఓకే అన్నారు.
అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేసేందుకు ఒప్పుకున్నారు.రామానాయుడు కారణంగా ఈ సినిమా థియేటర్లకు చేరి.
మంచి విజయాన్ని అందుకుంది.ఎంతో మంది నిర్మాతలను సమస్యల నుంచి గట్టెక్కించాడు రామానాయుడు.
ఎన్ఆర్ఐల ఆస్తుల కబ్జాకు చెక్ .. మైండ్ బ్లాకయ్యేలాంటి పరిష్కారం