అక్కినేని అన్నపూర్ణ చదివిన నవల సినిమా తెస్తే ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుసా.. ?
TeluguStop.com
తెలుగు సినిమా పరిశ్రమలో అప్పట్లో సంచలన విజయం సాధించిన సినిమా ప్రేమనగర్.అక్కినేని నాగేశ్వర్ రావు, వాణిశ్రీ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
రామానాయుడు ఈ సినిమాను నిర్మించి తన కెరీర్ నే మలుపుతిప్పుకున్నాడు.ఈ సినిమా ద్వారానే తను తిరుగులేని నిర్మాతగా మారిపోయాడు.
అటు ఈ సినిమాలో కేవీ మహదేవన్ అద్భుత సంగీతాన్ని అందించాడు.ఈ సినిమాలోని పాటలన్నీ చక్కటి విజయాన్ని అందుకున్నాయి.
ఆత్రేయ రాసిన డైలాగులు అదిరిపోయాయి.ఈ సినిమా మొత్తంగా ఓ దృశ్య కావ్యంగా నిలిచిపోయింది.
అయితే ఈ సినిమా తీయడం వెనుక పలు ఇంట్రెస్టింగ్ కారణాలున్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కోడూరి కౌసల్యా దేవి రాసిన నవల ఆధారంగా ఈ సినిమా చేయాలని ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి భావించాడు.
వెంటనే ఈ నవలకు సంబంధించిన రైట్స్ తీసుకున్నాడు.అక్కినేనితో ఈ సినిమాను రూపొందించాలి అనుకున్నాడు.
అక్కినేని అన్నపూర్ణ కూడా ఈ నవలను చదివి కథ బాగుందని చెప్పింది.కెఆర్ విజయను హీరోయిన్ గా ఎంచుకున్నారు.
ఇదే సమయంలో శ్రీధర్ రెడ్డికి కారు యాక్సిండెంట్ అయ్యింది.దీంతో ఆ సినిమాను ఆపి వేయాలని ఆయన భార్య చెప్పింది.
దీంతో ఈ సినిమా పనులకు బ్రేక్ పడింది.అయితే ఈ సినిమా కొనసాగిస్తే బాగుంటుందని అక్కినేని చెప్పాడు.
దీంతో రామానాయుడు 60 వేలు పెట్టి నవల హక్కులను తీసుకున్నాడు.స్క్రిప్టులో మార్పులు చేశారు.
"""/"/
హీరోయిన్ గా విజయ ప్లేస్ లో వాణిశ్రీని తీసుకున్నారు.ముందుగా భావించినట్లు డైరెక్టర్ గా ఎస్ ప్రకాశ్ రావు కొనసాగాడు.
అప్పట్లోనే 15 లక్షల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.
1971లోనే 34 ప్రింట్స్ తో సినిమాను రిలీజ్ చేశారు.ఈ సినిమా ఏకంగా 50 లక్షల రూపాయలను వసూలు చేసింది.
సినిమా విడుదల అయిన తొలి 15 రోజులు భారీ వర్షాలు కురిశాయి.అయినా జనాలు గొడుగులు వేసుకుని వచ్చి మరీ సినిమాలు చేశారు.
అటు తమిళం, హిందీలోనూ ఈ సినిమాలను తీశాడు రామానాయుడు.అక్కడ కూడా మంచి విజయం అందుకున్నాడు.
క్యారెట్ తో ఆరోగ్యమే కాదు జుట్టును కూడా పెంచుకోవచ్చు.. ఇంతకీ ఎలా వాడాలంటే?