ప్రణీత పెళ్లికి.. తన సినిమాలకు ఉన్న లింక్ ఏంటో మీకు తెలుసా?
TeluguStop.com
ప్రణీత సుభాష్.తెలుగు సినిమా రంగంలో తన అందంతో అభినయంతో ఓ చక్కటి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్.
ఏం పిల్లో ఏం పిల్లడో మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ క్యూట్ బ్యూటీ.
ఆ తర్వాత బావ, అనంతరం అత్తారింటికి దారేది సినిమాల్లో యాక్ట్ చేసింది.ఈ సినిమాల రభస, పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, డైనమైట్, హలో గురు ప్రేమ కోసమే, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది.
ఈ అమ్మడు కేవలం తెలుగులోనే కాదు కన్నడ, తమిళ్, హిందీ సినిమా పరిశ్రమలోనే అడగు పెట్టింది.
"""/"/
తెలుగులో ప్రణీత పలు సినిమాలు చేసింది.అయితే ఇందులో మూడు సినిమాల్లో ఓ కామన్ పాయింట్ మనకు కనిపిస్తుంది.
అత్తారింటికి దారేది సినిమాలో హీరో పవన్ కల్యాణ్ ముందుగా ప్రణీతను ఇష్టపడతాడు.కానీ చివరకు సమంతాను పెళ్లి చేసుకుంటాడు.
రభస సినిమాలో కూడా ఇంచు మించు ఇలాగే ఉంటుంది.హీరో మొదట తన మామయ్య కూతురు అనుకొని ప్రణీతను ఇష్టపడతాడు.
కానీ తర్వాత ఈమె కాదని తెలుసుకుని మరో హీరోయిన్ ను ఇష్టపడతాడు.హలో గురు ప్రేమ కోసమే మూవీలో కూడా హీరో రామ్ తొలుత ప్రణీతను ఇష్టపడతాడు.
ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ ని లవ్ చేస్తాడు. """/"/
సినిమాల్లో ఇలా జరిగినా ప్రణీత నిజ జీవితంలో మాత్రం అలా జరగలేదు.
తాజాగా ఆమె నితిన్ రాజు అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకుంది.ఈ విషయాన్ని స్వయంగా ఆమే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ప్రణీత ఇష్టపడి పెళ్లి చేసుకోవడం పట్ల సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం ప్రణీత వివాహం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.వివాహ జీవితాన్ని ప్రణీత సంతోషంగా గడపాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
అటు ప్రణీత.ప్రస్తుతం అజయ్ దేవగణ్ నటిస్తున్న భుజ్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే బాలీవుడ్ మూవీలో నటిస్తుంది.
ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది.
త్రివిక్రమ్ కి సలహాలు ఇస్తున్న అల్లు అర్జున్…కథ మారిపోయిందా..?