ప్రభాస్ తండ్రి తీసిన ఆ సినిమా కృష్ణం రాజు ని రెబల్ స్టార్ ని చేసిందా..?

రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు.తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు.

ఎన్ని సినిమాల్లో నటించి మెప్పించిన టాప్ హీరో.కత్తి అందుకో జానకీ అంటూ ఆయన పలికిన మాటలు ఇప్పటికీ జనాలు మరువలేరు అంటే ఆయన డైలాగుల పవరేంటో తెలుసుకోవచ్చు.

ఈయన నటించిన పలు సినిమాలు రికార్డు స్థాయిలో వసూళ్లు చేపట్టాయి.అలాంటి సినిమాలు పదుల సంఖ్యలో ఉన్నా ఇప్పుడు ఒక సినిమా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆ సినిమా మరేదో కాదు బొబ్బిలి బ్రహ్మన్న.రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు - ద‌ర్శ‌కేంద్రుడు కె.

రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్ లో వ‌చ్చిన చిత్రాల్లో చాలా సినిమాలు కనీ వినీ ఎరుగని రీతిలో వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి.

వాటిలో బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న‌ ఒక‌టి.ఇందులో బ్ర‌హ్మ‌న్న‌, ర‌విగా కృష్ణం రాజు డ్యూయెల్ రోల్ చేశాడు.

శార‌ద‌, జ‌య‌సుధ హీరోయిన్లుగా చేశవారు.సినిమాలోని పలు ముఖ్య పాత్ర‌ల్లో రావు గోపాల‌రావు, స‌త్య‌నారాయ‌ణ‌, అల్లు రామ‌లింగ‌య్య‌, నూత‌న్ ప్ర‌సాద్, అన్న‌పూర్ణ‌, ముచ్చ‌ర్ల అరుణ‌, కృష్ణ‌వేణి నటించారు.

చ‌క్ర‌వ‌ర్తి సంగీత‌ సార‌థ్యంలో రూపొందిన పాట‌ల్లో చ‌లిగాలి వీచింది.అబ్బా నాతో.

త‌ద్దిన‌క త‌ద్దిన‌క మ‌ల్లెలు తెచ్చా.లాంటి రొమాంటిక్ సాంగ్స్ తో పాటు ఓ రాతి మ‌నిషి.

బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న వీర గాథ‌లు అంటూ సంద‌ర్భానుసారంగా వచ్చే పాటలు సైతం జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

గోపీ కృష్ణా మూవీస్ ప‌తాకంపై కృష్ణం రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆయ‌న సోద‌రుడు ఉప్ప‌ల‌ పాటి సూర్య‌నారాయ‌ణ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

1984 మే 25న విడుద‌లై అఖండ విజ‌యం సాధించిన బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న‌ మూవీ ఇవాళ్టితో 37 వ‌సంతాలు పూర్తి చేసుకుంది.

ఈ సినిమా పలు అవార్డులను దక్కించుకుంది.ఉత్త‌మ హీరో, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు, ఉత్త‌మ స‌హాయ‌ న‌టి విభాగాల్లో నంది పుర‌స్కారాలు వచ్చాయి.

ఈ సినిమాలో నటనకు గాను ఉత్త‌మ హీరోగా కృష్ణం రాజు ఫిల్మ్ ఫేర్ అవార్డుని దక్కించుకున్నారు.

అబ్బా ఏం తెలివి.. ముంబై పోలీసు పరీక్షలో చిరంజీవి స్టైల్‌లో మోసం..!