ఈ ఆలయంలో స్వామివారి భక్తులు తెచ్చిన ప్రసాదాన్ని స్వీకరిస్తారు... ఆలయం ఎక్కడుందో తెలుసా?

ఈ ఆలయంలో స్వామివారి భక్తులు తెచ్చిన ప్రసాదాన్ని స్వీకరిస్తారు… ఆలయం ఎక్కడుందో తెలుసా?

సాధారణంగా మనం ఎన్నో దేవాలయాలను దర్శించి ఉంటాం.ప్రతి ఒక్క దేవాలయంలోనూ దేవుడికి నైవేద్యం సమర్పించి దానిని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.

ఈ ఆలయంలో స్వామివారి భక్తులు తెచ్చిన ప్రసాదాన్ని స్వీకరిస్తారు… ఆలయం ఎక్కడుందో తెలుసా?

అయితే దేవుడికి సమర్పించిన నైవేద్యం స్వామివారు తింటే ఏ విధంగా ఉంటుంది? వినడానికి ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

ఈ ఆలయంలో స్వామివారి భక్తులు తెచ్చిన ప్రసాదాన్ని స్వీకరిస్తారు… ఆలయం ఎక్కడుందో తెలుసా?

అచ్చం ఇదేవిధంగా భక్తులు సమర్పించిన నైవేద్యం స్వామివారు స్వీకరించిన ఆ నైవేద్యం భక్తులకు ప్రసాదంగా ఇస్తుంటారు.

ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది ఆలయంలోని స్వామి వారి విశిష్టత ఏమిటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం మహిషాసుర మర్దన జరిగిన తర్వాత ఆగ్రహంతో దుర్గాదేవి రగిలిపోతూ ఆమె అగ్ని తన రెండవ కంటి ద్వార ఒక కొండపైకి వదిలి ఆ కొండను పెళ్ళగించి గాలిలోకి విసిరింది.

ఆ కొండ పైనే ఇప్పుడు నరసింహ స్వామి కొలువై ఉన్న కొండ.ఆ కొండపై నరసింహ స్వామి అయితే వెలిసాడు కానీ అమ్మవారు రగిలిపోతూ వదిలిన అగ్నిజ్వాలలు అదే విధంగా ఉన్నాయి.

తరువాత నరసింహ స్వామి కూడా ప్రహ్లాదుడు తండ్రి అయిన హిరణ్యకశిపుని చంపి అదే ఆగ్రహంతో రగిలిపోతున్నాడు.

ఈ విధంగా నరసింహ స్వామి నుంచి వచ్చే అగ్నిజ్వాలలు అదుపు చేసుకోవడానికి స్వామివారు అనువైన ప్రదేశాన్ని వెతుకుతున్న సమయంలో, అగ్నితో రగులుతున్న నా కొండ ఎంతో అనువైన ప్రదేశం అని భావించి అక్కడే కొలువై ఉన్నారు.

నరసింహ స్వామి వారు అక్కడే కొలువై ఉన్నా ఆ కొండలో అగ్నిజ్వాలలు అలాగే వెలువడుతూ ఉన్నాయి.

అయితే ఈ అగ్నిజ్వాలలను చల్లార్చడానికి బ్రహ్మదేవుడు నరసింహ స్వామికి పానకంతో అభిషేకం చేశారు.

ఈ విధంగా పానకంతో అభిషేకం చేయడం వల్ల అగ్నిజ్వాలలు ఆవిరైపోయాయి.అప్పటినుంచి ఇక్కడ వెలసిన నరసింహ స్వామి వారికి పానకంతో అభిషేకం చేయడం ఆనవాయితీగా ఏర్పడింది.

"""/" / ఈ ఆలయంలోని స్వామి వారి గురించి మరొక ప్రత్యేకత ఏమిటంటే భక్తులు తెచ్చిన పానకాన్ని అర్చకులు స్వామివారిని నోటిలో పోస్తే స్వామివారు గుటకలు వేస్తూ ప్రసాదాన్ని స్వీకరిస్తారని, ఆ గుటకల శబ్దం కూడా స్పష్టంగా మనకు వినబడుతుంది.

ఈ విధంగా భక్తులు తెచ్చిన ప్రసాదం స్వామి వారు స్వీకరించి నోటి నుంచి కొంత ప్రసాదాన్ని బయటకు వదులుతారు.

దానిని భక్తులు మహా ప్రసాదంగా స్వీకరిస్తారు.ఈ విధంగా స్వామివారికి పానకంతో అభిషేకం చేసి, పానకాన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల ఇక్కడ వెలసిన స్వామివారిని పానకాల నరసింహ స్వామి అని పిలుస్తారు.

ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం విజయవాడ-గుంటూరు మధ్యలో కొలువై ఉంది.

రాజమౌళి తర్వాత స్థానంలో ఉన్న దర్శకులు వీళ్లేనా..?