నితిన్ గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు..

మన దేశంలో సినిమా హీరోలకు, క్రికెట్ స్టార్లకు ఉన్నంత మంది అభిమానులు మరెవరికీ ఉండరని చెప్పుకోవచ్చు.

వీరి తర్వాత అదే స్థాయిలో అభిమానులు ఉన్న వ్యక్తుల్లో కొందరు రాజకీయనాయకులు కూడా ఉన్నారు.

అయితే ముఖ్యంగా సినిమా తారలకే కాస్త ఎక్కువ మంది అభిమానులున్నారు.తమ అభిమాన హీరోల సినిమాల వస్తే.

ఆయా సినిమాలను లెక్కకు మించి చూస్తారు.ఆ సినిమా హిట్టా? ఫట్టా? అనే విషయాన్ని పక్కకు పెడితే తమ హీరో సినిమాను ఇన్నిసార్లు చూశాం అని చెప్పుకుంటారు అభిమానులు.

అలాంటి వీర ఫ్యాన్స్ లో ఒకడు హీరో నితిన్.తను పవన్ కల్యాణ్ కు వీరాభిమాని.

ఆయన నటించి తొలి ప్రేమ సినిమాను ఏకంగా 28 సార్లు చూశాడట.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.

నితిన్ తొలిసారిగా జయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఇందులో సదా తనతో జోడీ కట్టింది.

గోపీచంద్ అదిరిపోయే విలనిజాన్ని చూపించాడు.తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

తొలి సినిమాతోనే కనీవినీ ఎరుగని రీతిలో విజయాన్ని అందుకున్నాడు.వాస్తవానికి నితిన్ పూర్తి పేరు నితిన్ కుమార్ రెడ్డి.

1983 మార్చి 30న జన్మించాడు.తండ్రి సుధాకర్ రెడ్డి ఫిలిం డిస్ట్రిబ్యూటర్.

తల్లి విద్య హౌస్ వైఫ్. """/"/ ఒకానొక సమయంలో దర్శకుడు తేజ.

నితిన్ ను చూశాడు.తన సినిమాలో హీరోగా నితిన్ అయితే బాగుంటుందని తన తండ్రికి చెప్పాడు.

సుధాకర్ రెడ్డి కూడా ఆయన ప్రతిపాదనకు ఓకే చెప్పాడు.దీంతో ఆయన జయం సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఆ తర్వాత వరుస సినిమాలు విజయాన్ని అందుకున్నాయి.ఆ తర్వాత కొన్ని పరాజయాలు సైతం చవిచూశాడు.

పోయిన ఏడాది భీష్మ, రంగ్ దే మూవీస్ మంచి విజయాన్ని అందుకున్నాయి.ఇష్క్, గుండెజారి గల్లంతయ్యింది వంటి పలు విజయాలు అందుకున్నాడు.

గతేడాది చివరలో పెళ్లి చేసుకున్న నితిన్.సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.

పుష్ప2 సినిమాను బాయ్ కాట్ చేయడం రైటేనా.. వ్యతిరేకతకు అసలు కారణాలివే!