సినిమా మీద నమ్మకం.. టికెట్ లతోపాటు ఖర్చిఫ్ కూడా ఇచ్చారట తెలుసా?

సాధారణంగా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తూపోతూ ఉంటాయి.కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి పోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

నిజ జీవితంలోని కొన్ని సెంటిమెంట్ల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది.

ఇలాంటి సినిమాలు ఎన్నేళ్లయినా కూడా ఎవర్గ్రీన్ సినిమాలు గానే ఇండస్ట్రీలో మిగిలిపోతుంటాయి.తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని ప్రతి ప్రేక్షకుడిని కన్నీరు పెట్టించిన సినిమా మాతృదేవోభవ.

సినిమా చూస్తున్న సమయంలో ప్రతి ప్రేక్షకుడి కళ్ళలో నీళ్ళు తిరిగడం కాదు.బోరున ఏడవడం లాంటివి కూడా జరిగాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మాధవి ప్రధాన పాత్రలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అజయ్ కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది అయితే మలయాళంలో పెట్టిన ఆకాశదూతను ఇక తెలుగులో రీమేక్ చేశారు.

ముఖ్యంగా ఈ సినిమాలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాట ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

భర్తను కోల్పోయిన మహిళ పిల్లల పోషణ కోసం ఎంతో కష్ట పడుతూ ఉంటుంది.

అలాంటి సమయంలో ఇది ఆమె విషయంలో విధి చిన్నచూపు చూస్తుంది.ఆమె క్యాన్సర్ బారిన పడుతుంది.

ఆ సమయంలోనే ఇక లోకం తెలియని ముగ్గురు చిన్నారుల కోసం ఆ తల్లి పడే తపన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది అని చెప్పాలి.

"""/"/ అందుకే ఇక ఈ సినిమాలో తల్లీ బిడ్డల మధ్య సెంటిమెంట్ ప్రతి ఒక్కరిని కంట నీరు పట్టిస్తూ ఉంటుంది.

సినిమాలోని రాలిపోయే పువ్వా పాటకు ఏకంగా జాతీయ అవార్డు సైతం తగ్గింది చెప్పాలి.

37 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా టిక్ టాక్ సొంతం చేసుకుని సూపర్ హిట్ అయింది.

అయితే నిర్మాత కె.ఎస్.

రామారావు ఈ సినిమాకు నష్టం వస్తే నాది బాధ్యత అని చెప్పడంతో చివరికి టికెట్ యాజమాన్యాలు సినిమా టికెట్ల తో పాటు ఖర్చిఫ్ కూడా ఇవ్వాలని సూచించారట.

ఆ తర్వాత కాలంలో ఈ సినిమా సంచలన విజయం సాధించి ఎన్నో అవార్డులను కూడా దక్కించుకుంది.