అందుకేనేమో మనిషి మొదట 20 ఏళ్ళు అలా ఉండి..చివరి 10 ఏళ్ళు ఇలా ఉంటున్నాడు.! జీవిత సత్యం చెప్పే కథ.!
TeluguStop.com
ఒక రోజు దేవుడు ఓ కుక్కని తయారు చేసాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
దేవుడు అన్నాడు: రోజంతా ఇంటి ముందు కూర్చో.
ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు.నేను నీకు 20 ఏళ్ళు ఆయుషుని ఇస్తాను.
కుక్క: స్వామి ఇదేమి బాలేదు… నేను అన్ని ఏళ్ళు అరవలెను.కాబట్టి ఇదుగో 10 ఏళ్ళు నీకు ఇచ్చేస్తాను.
10 ఏళ్ళు మాత్రమే అరుస్తాను సరేనా !
దేవుడు: సరే.ఆ తర్వాతి రోజు దేవుడు ఒక కోతి ని తయారు చేసాడు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
దేవుడు: నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోష పరుచు.
నీకు 20 ఏళ్ళు ఆయుషు ఇస్తున్నాను.కోతి: ఏంటి !! కోతి చేష్టలు 20 ఏళ్ళ ! అమ్మో! కుక్క తన 10 ఏళ్ళు నీకు ఇచ్చింది గా ! నేను అలాగే ఇస్తాను.
దేవుడు : సరే…
మరుసటి రోజు దేవుడు మరల ఒక ఆవుని తయారు చేసాడు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
దేవుడు: నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్లి రోజంతా ఎండలో కస్టపడి సాయత్రం పాలు ఇస్తూ, రైతుకి సహాయం చేయి.
నీకు 60 ఏళ్ళు ఆయుషు ఇస్తునాను.ఆవు: 60 ఏళ్ళు ఈ గొడ్డు చాకిరీ నేను చేయలేను.
నాకు కూడా 20 ఏళ్ళు ఇచ్చి మిగతా 40 ఏళ్ళు నువ్వే తీసుకో… దేవుడు: సరే…
తర్వాత రోజు దేవుడు మనిషి ని తయారు చేసాడు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
దేవుడు: తిను, తాగు , ఆడుకో, పెళ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు.
నేను నీకు 20 ఏళ్ళు ఆయుషు ని ఇస్తున్నాను.మనిషి: ఏంటి? 20 ఏళ్లే నా? చూడు , నా 20 ఏళ్ళు తో పాటు ఆవు నీకు ఇచ్చిన 40, కోతి మరియు కుక్కకి ఇచిన 10 +10 మొత్తం : 80 ఏళ్ళు కావాలి…
దేవుడు: సరే…
అందుకే మొదట 20 ఏళ్ళు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు,ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు.
తరవాత 40 ఏళ్ళు ఆవు చేస్తున్నాటు తన కుటుంభానికి సహాయం చేయటానికి గొడ్డు చాకిరీ చేస్తున్నాడు.
ఆ తర్వాత 10 ఏళ్ళు కోతి చేష్టలు చేస్తూ తన మనవల్లు , మనవరల్లని నవ్విస్తున్నాడు.
తరవాత 10 ….ఇంటి ముందు కూర్చొని వచ్చే పోయే వాళ్ళని అరుస్తుంటాడు….
H3 Class=subheader-styleమనిషి జీవితం అంటే ఇదే./h3p
.